Akhanda 2 USA Collections: అఖండ 2 యూఎస్ అడ్వాన్స్ బుకింగ్ క్రేజీగా.. బాలయ్య మూవీకి కలెక్షన్లు ఎంతంటే?
గాడ్ ఆఫ్ మాసెస్, నటరత్న నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌ను ఓవర్సీస్‌లో ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రీ సేల్స్ వివరాలు, ఇతర అంశాల వివరాల్లోకి వెళితే..

అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో అఖండ 2 తాండవం సినిమాపై అనూహ్యమైన అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ చేశారు. స్టార్ హీరో, హీరోయిన్లు, అలాగే టాప్ సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ వాల్యూస్ కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాకు ఇప్పటి వరకు 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయి. ఈ సినిమా డిజిటల్ స్ట్రిమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ సుమారుగా 85 కోట్ల రూపాయల మేర జరిగింది. మ్యూజిక్ రైట్స్ కూడా భారీగా ఆదాయాన్ని సంపాదించిపెట్టింది. ఇంకా శాటిలైట్ బిజినెస్ ఫైనల్ కావాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
బాలకృష్ణ కెరీర్‌లోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా బిజినెస్ జరిగింది. ఓవర్సీస్‌లో ఈ సినిమాకు ఉన్న అంచనాలు, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 20 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన లభిస్తున్నది. నందమూరి అభిమానులు ఈ సినిమాను చూసేందుకు క్రేజీగా టికెట్లు కొనుగోలు చేస్తున్నారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అమెరికాలో అఖండ 2 సినిమాకు అత్యధిక సెంటర్లలో ప్రీ సేల్స్ ప్రారంభించారు. దాదాపు 175 లొకేషన్లలో 450 షోలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి 2000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు 52K అమెరికన్ డాలర్లు అంటే.. 45 లక్షల రూపాయల కలెక్షన్లు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇంకా 13 రోజుల సమయం ఉండటంతో ఇంకా భారీగా కలెక్షన్లు నమోదు అవుతాయని పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











