Akhanda 2 Worldwide Business: అఖండ 2 మూవీకి భారీ బాక్సాఫీస్ టార్గెట్.. బాలకృష్ణకు సాధ్యమయ్యేనా?

తెలుగు ప్రేక్షకులకు గాడ్ ఆఫ్ మాసెస్, నటరత్న నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ నటించిన ఈ సినిమా బిజినెస్ ఎన్ని కోట్లు? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Akhanda 2 Worldwide Business

అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో అఖండ 2 తాండవం సినిమాపై అనూహ్యమైన అంచనాలు పెరిగాయి. దాంతో ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా మలిచారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి ఈ సినిమాలో భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ చేశారు. స్టార్ హీరో, హీరోయిన్లు, అలాగే టాప్ సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ వాల్యూస్ కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు.

ఇక అఖండ సినిమా రిలీజైన సమయంలో పరిస్థితులు పక్కాగా వేరు. ఆ సమయంలో ఏపీలో ప్రభుత్వం విధానాలు సినిమా టికెట్ రేట్లకు చాలా ప్రతికూలంగా ఉండేవని విమర్శలు బలంగా వినిపించేవి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో విడుదలైన అఖండ చిత్రం తక్కువ టికెట్ రేట్లతోనే భారీ విజయం సాధించింది. ఆ సమయంలో సూపర్ హిట్ టాక్‌తో 130 కోట్ల రూపాయలు వసూలు చేయడం తెలిసిందే.

ఇక అఖండ 2 తాడవం సినిమా విషయానికి వస్తే.. తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ వరల్డ్ వైడ్‌గా 125 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. ఓవరాల్‌గా ఈ సినిమాకు ఇప్పటి వరకు 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బాలకృష్ణ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ బిజినెస్ కావడం క్రేజీగా మారింది.

అయితే అఖండ 2 సినిమా బాలకృష్ణకు బిజినెస్ పరంగా భారీ ఛాలెంజ్ కనిపిస్తున్నది. తక్కువ టికెట్ రేట్లతో భారీ వసూళ్లు సాధించిన అఖండతో పోల్చితే.. ఈ సినిమాకు రెండింతల హైప్ ఉంది. అలాగే టికెట్ల రేట్ల పెంపు కూడా భారీగానే ఉంటుంది. ఇలాంటి సానుకూల పరిస్థితుల మధ్య అఖండ 2 రాబోతున్నది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 300 కోట్ల రూపాయలు ఉంది. ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే.. బాలయ్య కెరీర్‌లో కొత్త శకం మొదలైనట్టే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X