Akhanda USA Collections అఖండ విజయ ఢంకా.. బాలయ్య ఖాతాలో అరుదైన రికార్డు.. 100 కోట్ల క్లబ్‌లో బోయపాటి
కరోనావైరస్ కారణంగా వరుస లాక్‌డౌన్లు, కర్ఫ్యూల కారణంగా డీలా పడ్డ సినీ పరిశ్రమకు అఖండ చిత్రం మంచి జోష్‌ను కల్పించింది. దేశవ్యాప్తంగా చతికిలపడిన బాక్సాఫీస్‌కు ఈ చిత్రం ఉత్తేజం కలిగించింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లనే కాకుండా ఓవర్సీస్ పరంగా రికార్డులు కూడా సృష్టించింది. అయితే గత రెండేళ్లలో నిస్తేజంగా మారిన యూఎస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల శివతాండవం చేసింది. అమెరికాలో గత 12 రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూలు చేసిందంటే..

హ్యాట్రిక్ కొట్టిన బాలయ, బోయపాటి
అఖండ చిత్రం ప్రత్యేక పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ కొట్టేందుకు థియేటర్లలోకి వచ్చారు. ప్రీమియర్లు, తొలి ఆట నుంచే హిట్ టాక్‌తో అఖండ చిత్రం దూసుకెళ్లింది. దాంతో తొలి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.

ఓవర్సీస్‌లో కాసులు వర్షం
అఖండ సినిమా ముందు వరకు బాలకృష్ణకు యూఎస్‌లోను, ఓవర్సీస్‌లో సరైన ట్రాక్ రికార్డు లేదు. అయితే అలాంటి వాస్తవాలను అఖండ తిరగరాసింది. బాక్సాఫీస్‌ను బలం దెబ్బ కొడుతూ కాసుల వర్షాన్ని కురిపించింది. కేవలం 12 రోజుల్లోనే ఈ చిత్రం అమెరికాలో 1 మిలియన్ డాలర్ల కలెక్షన్లను నమోదు చేసింది. సుమారు 7.60 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

అమెరికాలో గత 12 రోజుల్లో వసూళ్లు
అమెరికాలో గత 11 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ప్రీమియర్ల ద్వారా 332,509 డాలర్లు, తొలిరోజు 115,226 డాలర్లు, రెండో రోజు 128,427 డాలర్లు, మూడో రోజు 155,545, నాలుగో రోజు 85,041, ఐదో రోజు 21,778, ఆరో రోజు 28,796, ఏడో రోజు 15,370, ఎనిమిదో రోజు 12,018, తొమ్మిదో రోజు 26,411, పదో రోజు 44,921, పదకొండో రోజు 28,713 అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. పన్నెండో రోజు నాటికి ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది.

తొలిసారి బాలకృష్ణకు 100 కోట్లు
ఇక ఇదిలా ఉంటే.. అఖండ చిత్రం 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. బాలకృష్ణ కెరీర్‌లో తొలి వంద కోట్ల చిత్రంగా రికార్డును సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 107 కోట్ల గ్రాస్ కలెక్షన్లను, 62.90 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇక ఏపీ, తెలంగాణలోనే 87.70 కోట్ల గ్రాస్, 53.74 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషం.

9 కోట్ల లాభంతో విజయయాత్ర
అఖండ చిత్రం భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను నమోదు చేసింది. ఈ చిత్రం 54 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ చిత్రం సుమారు 9 కోట్ల లాభంతో విజయవంతంగా థియేటర్లలో అఖండ ప్రదర్శించబడుతున్నది. ఈ చిత్రం మరింత కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది.

యూఎస్‌లో మహేష్ బాబుదే టాప్ రికార్డు
ఇప్పటి వరకు అమెరికాలో 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన వారిలో మహేష్ బాబు టాప్‌లో కొనసాగుతున్నారు. మహేష్ నటించిన 10 చిత్రాలు మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరితే.. ఎన్టీఆర్ 6, పవన్ కల్యాణ్, నాని 5, అల్లు అర్జున్ 4, ప్రభాస్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ 3, రాంచరణ్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ 2, నాగచైతన్య 2, నితిన్, అఖిల్, నవీన్ పోలిశెట్టి 1 సినిమా మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరాయి.


Click it and Unblock the Notifications











