twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda Day 1 Box Office Collections: బాక్సాఫీస్ వద్ద బాలయ్య గర్జన.. మొదటి రోజే కెరీర్ బెస్ట్ కలెక్షన్స్

    |

    నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరపైకి వచ్చిన అఖండ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయ్యింది. చాలా కాలంగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ముందు నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. మొదటిరోజు అనుకున్నట్లుగా ఈ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. బాలకృష్ణ కెరీర్ మొత్తంలో అత్యధిక స్థాయిలో వసూళ్లను అందుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయంపై ఒక లుక్కేస్తే..

    మైమరిపించిన బాలయ్య

    మైమరిపించిన బాలయ్య

    నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించి అఖండసినిమా విడుదలకు ముందు నుంచే అంచనాలను భారీస్థాయిలో పెంచేసింది. ముఖ్యంగా టీజర్ ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక బాలయ్య లుక్ కూడా సరికొత్తగా ఉండటంతో మొదటి రోజు మొదటి షో చూడాలి అని ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. బాలకృష్ణ గతంలో ఎప్పుడూ లేని విధంగా అఘోరా పాత్రతో కూడా ప్రేక్షకులను మైమరిపించారు.

     బోయపాటి త్యాగం

    బోయపాటి త్యాగం

    బోయపాటి శ్రీను వినయ విధేయ రామ సినిమా తో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో డిజాస్టర్స్ ఎదుర్కొన్నాడు. ఇక లెజెండ్ సరైనోడు సినిమాలో తర్వాత మళ్లీ ఆయన సైరన సక్సెస్ చూడలేదు అందుకే అఖండ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కావాలి అని చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం ఆయన రెమ్యునరేషన్ కూడా త్యాగం చేశాడు. సినిమా సక్సెస్ అయితేనే లాభాల్లో వాటా వచ్చే విధంగా ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు.

     యూఎస్ లో మొదటిరోజు వసూళ్లు

    యూఎస్ లో మొదటిరోజు వసూళ్లు


    మొత్తానికి అనుకున్నట్లుగానే అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఇక విడుదలకు ముందు రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్స్ పై సినీ పండితులలో ఒక అంచనా ఏర్పడింది. ఇక దానికంటే ఎక్కువగానే ఫస్ట్ డే సినిమా మంచి షేర్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా యూఎస్ కూడా అఖండ సినిమా ప్రీమియర్స్ తోనే 331,803 డాలర్లు అందుకుంది. మొదటిరోజు 101,458కోట్ల వసూళ్లు రాగా మొత్తంగా 3.24 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో షాక్ ఇచ్చింది.

    మొదటిరోజు ఏరియాల వారిగా కలెక్షన్స్..

    మొదటిరోజు ఏరియాల వారిగా కలెక్షన్స్..

    నైజాంలో భారీ స్థాయిలో మార్కెట్ ఉన్న బాలయ్యకు మరోసారి మంచి వసూళ్లు అందినట్లు సమాచారం. ఏపీలో కూడా థియేటర్స్ లో ఎక్కడ చూసినా కూడా బాలయ్య బాబు మాస్, జై బాలయ్య అని నినాదాలు చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. థియేటర్లు మారుమ్రోగి పోతున్నాయి. ఇక నైజాం ఏరియాలో ఈ సినిమా 4.39 కోట్లు రాగా, సీడెడ్ లో 4.02కోట్లు, ఉత్తరాంధ్ర 1.36కోట్లు, ఈస్ట్ 1.05కోట్లు, వెస్ట్ 96లక్షలు, గుంటూరులో 1.87కోట్లు, కృష్ణ 81లక్షలు, నెల్లూరు 93లక్షలు.

    ఆంధ్ర, తెలంగాణలో మొత్తం ఎంతంటే?

    ఆంధ్ర, తెలంగాణలో మొత్తం ఎంతంటే?

    ఏపీ తెలంగాణలో మొత్తంగా 15.39కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. సినిమా అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక విధంగా లవ్ స్టోరీ సినిమా రికార్డులను అఖండ బ్రేక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు కూడా ఇంకా రావాల్సి ఉంది. తప్పకుండా అఖండ సినిమా మొదటిరోజు ఆల్ ఇండియా రికార్డును బ్రేక్ చేస్తుంది అని అర్థమవుతుంది.

    మొదటి రోజు ఇండియా మొత్తం వసూళ్లు

    మొదటి రోజు ఇండియా మొత్తం వసూళ్లు

    ఒక విధంగా కరోనా లాక్‌డౌన్‌ అనంతరం అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న టాప్ సినిమాల్లో అఖండ కూడా నిలుస్తుందనే అర్థమవుతుంది. అంతే కాకుండా బాలకృష్ణ కెరీర్ లోనే ఈ సినిమా అత్యదిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఇండియాలో మొత్తంగా 24కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన అఖండ ఓవర్సీస్ లో 5కోట్లు రాబట్టినట్లు సమాచారం.

    ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా


    ప్రపంచవ్యాప్తంగా 29.60కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి సినిమా మిగతా వీకెండ్స్ లో ఏ స్థాయిలో వసూళ్లను సాధిస్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు అనుకున్నంతగా లేకపోయినప్పటికీ కూడా బాలయ్య బాబు తన స్టార్ హోదాతో జనాలను భారీస్థాయిలో మెప్పించాడు. బాలకృష్ణ కూడా బాక్స్ ఆఫీసు వద్ద సక్సెస్ చూసి చాలా కాలం అయింది. అంతే కాకుండా ఓ విభిన్నమైన క్యారెక్టర్ లో చూసి కూడా చాలా కాలమైంది. మొత్తానికి సినిమాలో అఖండ పాత్ర థియేటర్స్ ను షేక్ చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని సినిమా షేర్ కలక్షన్స్ కూడా గట్టిగానే వచ్చినట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Mahesh Babu To Undergo Surgery | SSMB Response On Akhanda
    మొత్త ఎంత రావాలంటే..

    మొత్త ఎంత రావాలంటే..

    ప్రపంచవ్యాప్తంగా అఖండ బిజినెస్ 59కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. చూస్తుంటే అఖండ సినిమా నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వాలి అంటే మొత్తంగా 60కోట్లకు పైగా వసూళ్లను అందుకోవాల్సి ఉంటుంది. మొదటి రోజు వచ్చిన షేర్ ను బట్టి చూస్తే ఈ సినిమా ఈ వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Balakrishna's Akhanda Day 1 Box Office Collections: Balayya Gets Career Best Numbers
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X