twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda day 1 Collections బాలకృష్ణ కెరీర్‌లోనే హయ్యెస్ట్.. యూఎస్‌లో ఊహించని విధంగా కలెక్షన్లు

    |

    తెలుగు సినిమా పరిశ్రమ లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నట్టు కనిపిస్తున్నది. థియేటర్లు మూతపడటంతో కొన్ని నెలలుగా బాక్సాఫీస్ మూగబోయింది. కలెక్షన్ల రికార్డులు తుప్పు పట్టినట్టుగా కనిపిస్తున్నాయి. అయితే రికార్డుల మోత మోగించేందకు రానున్న రెండు నెలలు భారీ బడ్జెట్ సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో అఖండ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు థియేటర్లలో రిలీజైంది. అయితే తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంత ఉండబోతుందంటే..

    అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్

    అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్

    బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ హిట్‌కు సిద్ధం కావడంతో అఖండ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.53 కోట్లకుపైగానే బిజినెస్ జరిగింది. నైజాంలో రూ.10 కోట్లకుపైగా, సీడెడ్‌లో రూ.10.6 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.6 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా 4 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లా రూ.3.5 కోట్లు, గుంటూరు రూ.5.4 కోట్లు, కృష్ణా జిల్లాలో 3. 7 కోట్లు, నెల్లూరులో రూ.1.8 కోట్లు వసూలు చేసింది. దాంతో ఏపీ, తెలంగాణలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.45.5 కోట్ల మేర అయింది.

    ఓవర్సీస్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్

    ఓవర్సీస్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్

    తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే.. కన్నడ, ఇతర రాష్ట్రాల్లో అఖండ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.5 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.2.5 కోట్లకు అమ్ముడుపోయాయి. అయితే బాలయ్య సినిమా కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రంగా అఖండ తెరకెక్కింది. ఈ చిత్రం సుమారు 54 కోట్ల రూపాయలతో బాక్సాఫీస్ జైత్రయాత్రను ప్రారంభించింది. కనీసం 53 కోట్లు సాధిస్తే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    ప్రపంచవ్యాప్తంగా 1550కిపైగా థియేటర్లలో

    ప్రపంచవ్యాప్తంగా 1550కిపైగా థియేటర్లలో


    అఖండ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అయింది. తెలుగు రాష్ట్రాలతోపాటు వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 1550 కిపైగా థియేటర్లలో రిలీజైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన అడ్వాన్స్‌ బుకింగ్‌కు భారీ రెస్పాన్స్ లభించింది. రాయలసీమ, గుంటూరు, నెల్లూరు జిల్లాలో అడ్వాన్స్ బుకింగ్ ఊహించని విధంగా జరిగింది. దాంతో తొలి రోజు భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమైంది.

    పాజిటివ్ టాక్‌తో అఖండ

    పాజిటివ్ టాక్‌తో అఖండ


    అయితే అంచనాలకు తగినట్టు అఖండ చిత్రం పాజిటివ్ టాక్‌లో బాక్సాఫీస్ రన్‌ను మొదలుపెట్టింది. నందమూరి అభిమానులు అఖండ ప్రీమియర్ల తర్వాత పండుగ చేసుకొనే పనిలో పడ్డారు. చాలా రోజులుగా నందమూరి హీరో సినిమా థియేటర్లలో రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా కనిపించారు. పలు చోట్ల నుంచి మంచి టాక్ వస్తుండటంతో వసూళ్లు భారీగానే ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    అమెరికాలో ప్రీమియర్ కలెక్షన్లు

    అమెరికాలో ప్రీమియర్ కలెక్షన్లు

    అమెరికాలో అఖండ సినిమాకు అద్భుతమైన స్పందన వ్యక్తమవుతున్నది. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. అయితే తొలి రోజు ప్రీమియర్ల ద్వారా 300K డాలర్లు వసూలు చేయవచ్చనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. యూఎస్ బాక్సాఫీస్ రిపోర్టు ప్రకారం ప్రీమియర్ల ద్వారా తొలి రోజు 2.25 కోట్లకుపైగా రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    తొలి రోజు కలెక్షన్ల అంచనా ఇలా..

    తొలి రోజు కలెక్షన్ల అంచనా ఇలా..


    ఇక తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వసూళ్లు భారీగానే ఉండే అవకాశం ఉంది. తొలి రోజు అఖండ చిత్రం రూ.9 నుంచి రూ.10 కోట్ల రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉంది. అయితే రూ.10 కోట్లకుపైగా వసూళ్లు రాబడితే.. హై రేంజ్ వసూళ్లు సాధించినట్టు అవుతుంది.

    ఆస్ట్రేలియాలో సరికొత్త రికార్డు

    ఆస్ట్రేలియాలో సరికొత్త రికార్డు


    ఆస్ట్రేలియా కలెక్షన్ల విషయానికి వస్తే.. అఖండ చిత్రం వసూళ్ల పరంగా దుమ్ము రేపుతున్నది. ఈ చిత్రాన్ని సుమారు 30 లొకేషన్లలో రిలీజ్ చేశారు. తొలి రోజు ప్రీమియర్ల ద్వారా 84567 ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ చిత్రం 53 వేల ఆస్ట్రేలియన్ డాలర్లను వసూలు చేసింది. ఇప్పటికి తెలుగు సినిమా అత్యధికంగా సాధించిన కలెక్షన్లు ఇవే. ఇప్పుడు బోయపాటి తన రికార్డును తానే తిరగరాశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    English summary
    Tollywood box office bonanza Balakrishna Nandamoori's Akhanda movie has released in Theatres on December 2nd. Here is the Boyapati Srinu's day 1 expected collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X