Akhanda day 5 collections.. దిల్ రాజుకు భారీ లాభాలు పంచిన అఖండ.. నాలుగు రోజుల్లోనే రికార్డుస్థాయిలో

నట సింహం, బాక్సాఫీస్ బొనాంజా నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెకట్ర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం బాక్సాఫీస్ వద్ద రఫాడిస్తున్నది. పలు ప్రాంతాల్లో ఈ చిత్రం తొలివారాంతంలోనే లాభాల్లోకి చేరుకోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అయితే మిగితా ప్రాంతాల్లో కంటే నైజాంలో ఈ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది.

అఖండ నైజాం థియేట్రికల్ హక్కులను రూ.10.5 కోట్లు చెల్లించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకొన్నాడు. అయితే విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 12 కోట్ల రూపాయల షేర్‌ను, రూ.20 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో తొలి వారాంతంలోనే దిల్ రాజ్‌కు సుమారు రూ.1.5 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టినట్టు సమాచారం. అయితే ఇటీవల కాలంలో పలు చిత్రాలను చవి చూసిన దిల్ రాజుకు అఖండ చిత్రం లాభాల్లోకి తీసుకెళ్లిందనే విషయాన్ని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Akhanda day 5 expected collections worldwide, Dil Raju into profit zone in Nizam

ఇక తొలి వారాంతపు అఖండ కలెక్షన్ల విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా అఖండ చిత్రం 43 కోట్ల షేర్‌ను రాబట్టింది. అయితే కెరీర్‌లోనే బాలకృష్ణకు ఇది అత్యుత్తమ కలెక్షన్లు అని చెప్పుకొంటున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా లాభాల్లోకి రావాలంటే. .ఇంకా 13 కోట్లు రాబట్టాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, ఐదు రోజు అంటే సోమవారం కలెక్షన్లు అఖండకు అగ్ని పరీక్షగా మారాయి. సోమవారం ప్రతీ సినిమాకు లిట్మస్ టెస్ట్‌గా మారుతుంది. కానీ అఖండ విషయంలో అలాంటి సమస్యలు లేవని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఆంధ్రాలో అంటే ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో తుఫాన్ కారణంగా కలెక్షన్లు తగ్గే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే అంతాసవ్యంగా జరిగితే 5వ రోజు రూ.4 కోట్లు వసూలు చేయవచ్చనే అవకాశాలు ఉన్నాయని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X