Akhanda 10 days Collections: ఫైనల్ గా సెంచరీ కొట్టేసిన బాలయ్య.. 100కోట్ల సింహం!

మాస్ కమర్షియల్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకు వచ్చినా కూడా మాస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని సినిమా క్లిక్ అయితే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాయి. ఇక అలాంటి దర్శకుడికి బాలయ్య దొరికితే బాక్సాఫీస్ వద్ద వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబినేషన్ ఎంత బలంగా ఉంటుందో మరోసారి రుజువయింది. అంతేకాకుండా బాలయ్య తన కెరీర్ లోనే మొదటి సారి 100 కోట్ల బాక్సాఫీస్ మార్క్ ను అందుకుని సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సినిమాకు సంబంధించిన పది రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఫామ్ లోకి వచ్చిన బాలయ్య

ఫామ్ లోకి వచ్చిన బాలయ్య

బోయపాటి శ్రీను ఇదివరకే నందమూరి బాలకృష్ణ తో సింహ లెజెండ్ సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు కూడా ఇద్దరికీ సమానమైన క్రేజ్ ను అందించాయి. ఇక ప్రతిసారీ వరుస అపజయాలతో సతమతమైన బాలకృష్ణకు బోయపాటి అందించిన బూస్ట్ అయితే అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో బాలయ్య చేసిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి మళ్ళీ బోయపాటి అఖండ సినిమాతోనే ఆయన ఫామ్ లోకి వచ్చేశాడు.

పునకాలు వచ్చేలా విజిల్స్..

పునకాలు వచ్చేలా విజిల్స్..

నందమూరి బాలకృష్ణ అభిమానులకు అఖండ ఏ స్థాయిలో నచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాధారణంగా బాలయ్య కు సంబంధించిన ఎలాంటి ప్రస్తావన వచ్చినా కూడా జై బాలయ్య నినాదాలు థియేటర్ లో మారు మ్రోగి పోతుంటాయి. ఇక అఖండ సినిమా తో మళ్లీ థియేటర్స్ లో అభిమానులు పునకాలు వచ్చేలా విజిల్స్ వేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 54 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి రాగా ఇక తొలివారంలోనే ఆ టార్గెట్ ఫినిష్ చేసింది.

ఆ ఏరియాల్లో ఇంకా రావాలి..

ఆ ఏరియాల్లో ఇంకా రావాలి..

ఇక మొదటి వారం తరువాత అఖండ సినిమా కలెక్షన్స్ కొంత తగ్గుతూ వస్తున్నాయి. అయితే శనివారం రోజు మళ్ళీ చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అఖండ మంచి కలెక్షన్స్ అందుకుంది. నిర్మాతలకు ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి మంచి ఆదాయం లభించింది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఏరియాల్లో మాత్రం ఇంకా పెట్టిన పెట్టుబడికి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాల్సి ఉంది. టికెట్ల ధరలు అక్కడ కూడా కొంచెం పెంచి ఉంటే కలెక్షన్స్ డోస్ మరోలా ఉండేది. ఇక ఆదివారం కూడా అఖండకు మంచి వసూళ్లు దక్కే ఛాన్స్ ఉంది.

10వ రోజు ఎంత వచ్చాయంటే?

10వ రోజు ఎంత వచ్చాయంటే?

బాలకృష్ణ అఖండకు తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు కలెక్షన్లు కొంత తగ్గాయి. కానీ పదవ రోజు మళ్ళీ వాటికంటే కొంత పెరిగాయి. ఇక నైజాంలో రూ. 41 లక్షలు, సీడెడ్‌లో రూ. 25లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 14 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. మొత్తంగా 10వ రోజు రెండు రాష్ట్రాల్లో రూ. 1.17 కోట్లు షేర్, రూ. 1.8 కోట్లు గ్రాస్ వచ్చింది.

10 రోజుల్లో వచ్చిన వసూళ్లు..

10 రోజుల్లో వచ్చిన వసూళ్లు..

అఖండ మూవీకి 10 రోజులకు.. నైజాంలో రూ. 16.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.10 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.39 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.80 కోట్లు, గుంటూరులో రూ. 3.96 కోట్లు, కృష్ణాలో రూ. 2.99 కోట్లు, నెల్లూరులో రూ. 2.15 కోట్లు వచ్చాయి. ఇక రెండు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 49.34 కోట్లు షేర్ వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా.. బాలయ్య సెంచరీ

ప్రపంచ వ్యాప్తంగా.. బాలయ్య సెంచరీ

ఆంధ్ర నైజాం లో గట్టిగానే రాబట్టిన అఖండ 10 రోజులకు కలిపి రూ. 49.34 కోట్లు వసూలు చేసిన అఖండ కర్నాటకతో పాటు మిగతగా రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్‌లో మొత్తంగా రూ. 9.35 కోట్లు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 58.74 కోట్లు షేర్ రాగా రూ. 100 కోట్లు గ్రాస్‌ను రాబట్టినట్లు సమాచారం. గౌతమిపుత్ర సినిమాతో 75కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను అందుకున్న బాలయ్య ఈసారి అఖండతో మొదటిసారి సెంచరీ కొట్టేశాడు.

Recommended Video

Lakshya Movie Review || Filmibeat Telugu
అఖండ తెచ్చిన లాభాలు

అఖండ తెచ్చిన లాభాలు

సింహా లెజెండ్ అనంతరం పవర్ఫుల్ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు తగ్గట్టుగానే రూ. 53 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక రూ. 54 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చిన ఈ సినిమా 8రోజుల్లోనే టార్గెట్ ను ఫినిష్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 58.78 కోట్లు వసూలు చేసింది. ధీంతో ఇప్పటికే మూడు కోట్ల వరకు లాభాలను అందుకున్నట్లు సమాచారం. ఇక ఆదివారం కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X