Akhanda 12 days Collections: అఖండ రికార్డు బ్రేక్ కలెక్షన్లు.. తగ్గని బాలయ్య బాక్సాఫీస్ జోరు

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది. విడుదలకు ముందే ఈ సినిమా భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాలయ్య బాబు కి కెరీర్లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ ను అందించింది. సినిమాకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా చిత్ర యూనిట్ సభ్యులు భారీ స్థాయిలో ప్రమోషన్ చేయగా అది మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇక సినిమా 12వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే..

బెస్ట్ బాక్సాఫీస్ కాంబినేషన్

బెస్ట్ బాక్సాఫీస్ కాంబినేషన్

గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలక్రిష్ణ మళ్లీ ఎప్పటిలానే బోయపాటి శ్రీను సినిమాతోనే హిట్ అందుకున్నాడు. వీరి కాంబినేషన్లో ఇదివరకు వచ్చిన సింహా లెజెండ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయి. ఇక మూడవ సారి కూడా మంచి విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డు నెలకొల్పారు. బోయపాటి శ్రీను కూడా వరుస పరాజయాల అనంతరం ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. టాలీవుడ్ బెస్ట్ బాక్సాఫీస్ కాంబినేషన్ గా బోయపాటి బాలయ్య క్రేజ్ అందుకున్నారు.

టార్గెట్ ఫినిష్

టార్గెట్ ఫినిష్

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించాడు. ముఖ్యంగా అక్కడ పాత్ర ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి నుంచి చివరి వరకు కూడా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న టార్గెట్ ను ఇలాంటి కఠిన సమయంలో అందుకుంటుందా లేదా అనే కామెంట్స్ చాలానే వచ్చాయి. ఇక 53 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చిన అఖండ చాలా తొందరగా నే టార్గెట్ ను పూర్తి చేసింది.

 12వ రోజు వచ్చిన షేర్..

12వ రోజు వచ్చిన షేర్..


బాలకృష్ణ అఖండకు తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజు కలెక్షన్లు కొంత తగ్గాయి. నైజాంలో రూ. 32 లక్షలు, సీడెడ్‌లో రూ. 19 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 5
4 లక్షలతో.. మొత్తంగా 12వ రోజు రెండు రాష్ట్రాల్లో రూ. 0.84 కోట్లు షేర్ రాగా రూ. 1.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

12 రోజుల్లో వచ్చిన వసూళ్లు..

12 రోజుల్లో వచ్చిన వసూళ్లు..

అఖండ సినిమాకు 12 రోజులకు.. నైజాంలో రూ. 17.79 కోట్లు, సీడెడ్‌లో రూ. 13.70 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.73 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.05 కోట్లు, గుంటూరులో రూ. 4.33 కోట్లు, కృష్ణాలో రూ. 3.22 కోట్లు, నెల్లూరులో రూ. 2.35 కోట్లు వచ్చాయి. ఇక రెండు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 53.74 కోట్లు షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. గ్రాస్ 87.70 కోట్లు.

ప్రపంచ వ్యాప్తంగా..

ప్రపంచ వ్యాప్తంగా..

ఆంధ్ర నైజాం లో గట్టిగానే రాబట్టిన అఖండ 12 రోజులకు కలిపి రూ. 53.74 కోట్లు వసూలు చేసింది. కర్నాటకతో పాటు మిగతగా రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్‌లో మొత్తంగా రూ. 9 కోట్లకు పైగానే రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 62.90 కోట్లు షేర్ రాగా రూ. 107.5 కోట్లు గ్రాస్‌ను రాబట్టినట్లు సమాచారం. గౌతమిపుత్ర సినిమాతో 75కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను అందుకున్న బాలయ్య ఈసారి అంతకుమించి అనేలా అఖండతో మొదటిసారి 100కోట్ల క్లబ్ లో చేరాడు.

అఖండ ప్రాఫిట్స్ ఎంతంటే?

అఖండ ప్రాఫిట్స్ ఎంతంటే?


సింహా, లెజెండ్ వంటి వరుస బాక్సాఫీస్ హిట్స్ అనంతరం బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఇక రూ. 53 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన అఖండ ఇక రూ. 54 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇక ఈ సినిమా 10 రోజుల్లోనే టార్గెట్ ను ఫినిష్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 62.90 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ఇప్పటికే 8.90కోట్ల వరకు లాభాలను అందుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X