Akhanda 9 days Collections: 100కోట్లకు చేరువలో బాలయ్య.. టార్గెట్ ఫినిష్ అయ్యింది.. కానీ?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ మొత్తానికి సంచలన విజయాన్ని అందుకున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఊహించినట్లుగానే సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించింది. మొదటి వారంలోనే బాక్సాఫీస్ టార్గెట్ ను ఫినిష్ చేసి ప్రస్తుతం ప్రాఫిట్స్ లో కొనసాగుతోంది. ఇక గ్రాస్ కలెక్షన్స్ పరంగా వంద కోట్లకు కూడా చెరువులో ఉండడంతో ఈ సినిమా ఇంకా ఎంతవరకు కలెక్షన్స్ అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్
బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అనగానే సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక దానికి తోడు థమన్ కూడా ఈసారి వారికి అద్భుతమైన సంగీతాన్ని అందించి రికార్డు స్థాయిలో విజయాన్ని అందించాడు. ముఖ్యంగా మాస్ ఎలివేషన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఉపయోగపడింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 53 కోట్ల టార్గెట్ తో రంగంలోకి దిగింది. బాలయ్య కెరీర్ లోనే ఇది అత్యదిక టార్గెట్.

ఈ వారం చాలా కీలకం..
ఇక మొదటి వారం అనంతరం ఈ సినిమా కలెక్షన్స్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. అఖండ 6వ రోజు నుంచి 8వ రోజు మధ్యలో చాలా తక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ముందుగానే నిర్మాతలకు పెట్టిన పెట్టుబడికి మంచి ఆదాయం లభించింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఏరియాల్లో మాత్రం ఇంకా పెట్టిన పెట్టుబడికి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రాలేదని సమాచారం. ఇక శని ఆదివారాల్లో ఈ సినిమాకు చాలా ముఖ్యం కానున్నాయి. రెండో వారంపై చిత్ర యూనిట్ సభ్యులు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు

9వ రోజు ఎంత వచ్చాయంటే?
బాలకృష్ణ అఖండకు తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు కలెక్షన్లు కొంత తగ్గాయి. ఇక నైజాంలో రూ. 35 లక్షలు, సీడెడ్‌లో రూ. 25 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 6.20 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. వ రోజు రెండు రాష్ట్రాల్లో రూ. 1.03 కోట్లు షేర్, రూ. 1.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

9 రోజుల్లో వచ్చిన మొత్తం..
అఖండ మూవీకి 9 రోజులకు మొత్తంగా భారీ వసూళ్లు వచ్చాయి. నైజాంలో రూ. 15.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.45 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.85 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 3.25 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.67 కోట్లు, గుంటూరులో రూ. 3.82 కోట్లు, కృష్ణాలో రూ. 2.83 కోట్లు, నెల్లూరులో రూ. 2.06 కోట్లు వచ్చాయి. ఇక రెండు రాష్ట్రాల్లో కలిపి టోటల్ గా రూ. 46.63 కోట్లు షేర్ వచ్చినట్లు సమాచారం.

ప్రపంచ వ్యాప్తంగా..
తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాబట్టిన అఖండ ఆంధ్ర ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ ను ఫినిష్ చేయాల్సి ఉంది. ఏపీ, తెలంగాణలో 8 రోజులకు కలిపి రూ. 46.63 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో అలాగే ఓవర్సీస్‌లో మొత్తంగా రూ. 8.95 కోట్లు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 55.58 కోట్లు షేర్ రాగా రూ. 93.50 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ప్రాఫిట్స్ ఎంతంటే?
బాక్సాఫిష్ కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ' మూవీకి అంచనాలకు తగ్గట్టుగానే రూ. 53 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక రూ. 54 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చిన అఖండ తొమ్మది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 55.58 కోట్లు వసూలు చేసింది. ధీంతో ఇప్పటికే కోటి వరకు లాభాలను అందుకున్నట్లు సమాచారం. ఇక శని ఆదివారాలు కూడా సినిమాకు చాలా కీలకం కానున్నాయి. మరి రెండవ వారం ఎలాంటి వసూళ్లు దక్కుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











