twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda Day 5 Collection: బాలయ్యకు అసలు పరీక్ష మొదలైంది.. ఇంకా ఎంత రావాలంటే?

    |

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత మరొక సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా అఖండ అనుకున్నట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలన విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవడం విశేషం. మొత్తానికి బాలయ్య తన సినీ జీవితంలో మొదటి సారి అత్యధిక వేగంగా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ ఉన్నాడు. ఇక సోమవారం రోజు ఈ సినిమాకు అసలు పరీక్ష మొదలైంది.

    అతిపెద్ద టార్గెట్

    అతిపెద్ద టార్గెట్

    బోయపాటి శ్రీను అనగానే మాస్ యాక్షన్ సినిమాలకు స్పెషల్ పెట్టింది పేరు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అలాంటి దర్శకుడికి బాలకృష్ణ ఇలాంటి మాస్ హీరో దొరికితే బాక్సాఫీస్ వద్ద పునకాలు వస్తాయని మరోసారి రుజువయ్యింది. అఖండ సినిమా మొత్తం 53 కోట్ల బిజినెస్ మార్కెట్లోకి వచ్చింది. ఒక విధంగా బాలకృష్ణ సినీ జీవితంలోనే ఇది అతి పెద్ద టార్గెట్.

    రోజుల వారిగా..

    రోజుల వారిగా..

    నందమూరి బాలకృష్ణ తన సినీ జీవితంలో మొదటి సారి అత్యధిక వేగంగా 50 కోట్ల అసలు చాలా వేగంగా కుంటున్నాడు. ఇక గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ మొదటి రోజు 15.39కోట్ల షేర్ వచ్చింది. ఇక రెండవరోజు 6.83కోట్లు, మూడవ రోజు 7.03కోట్లు, నాలుగవ రోజు 8.31కోట్లు వచ్చాయి.

    5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్

    5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్

    సోమవారం నుంచి ఈ సినిమాకు అసలు పరీక్ష మొదకైంది. వీకెండ్ అనంతరం 5వ రోజు అఖండ పరవాలేదు అనే విధంగా వసూళ్లను రాబట్టింది. ఇక ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో రూ. 1.31 కోట్లు, సీడెడ్‌లో రూ. 91 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 38 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 57 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 24 లక్షలు, కృష్ణాలో రూ. 23 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 3.58 కోట్లు షేర్ దక్కింది, రూ. 5.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

    మొత్తం ఐదు రోజుల్లో..

    మొత్తం ఐదు రోజుల్లో..

    అఖండ' మూవీకి ఐదు రోజులకు కలిపి భారీ వసూళ్లు వచ్చాయి. నైజాంలో రూ. 13.42 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.72 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.12 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.82 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.22 కోట్లు, గుంటూరులో రూ. 3.50 కోట్లు, కృష్ణాలో రూ. 2.51 కోట్లు, నెల్లూరులో రూ. 1.83 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 41.14 కోట్లు షేర్, రూ. 64.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచవ్యాప్తంగా..

    ప్రపంచవ్యాప్తంగా..

    'అఖండ' మూవీకి అంచనాలకు తగ్గట్లుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 49.04 కోట్లు వసూలు చేసింది. ఇక గ్రాస్ కలెక్షన్స్ 80.30కోట్లు వచ్చాయి.

    Recommended Video

    Akhanda Movie Villain Powerful Background | Indian Army | Nitin Mehta || Filmibeat Telugu
     ఇంకా ఎంత రావాలంటే..

    ఇంకా ఎంత రావాలంటే..

    నందమూరి బాలకృష్ణ ఓవర్సీస్ లో కూడా ఈసారి భారీ స్థాయిలో కర్ణాటకలో అలాగే మిగతా రాష్ట్రాల్లో 3.52కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ లో అయితే 4.38కోట్లు వచ్చాయి. మొత్తంగా 54కోట్ల షేర్ రాబట్టాల్సి అఖండ టార్గెట్ కు దగ్గరగా వచ్చేసింది. ఎప్పటికి 49కోట్ల షేర్ వచ్చింది అంటే మరో 4.96 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

    English summary
    Akhanda movie day 5 total box office collections..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X