For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అఖండ సీక్వెల్ స్టోరీ మేయిన్ లైన్ ఇదే.. అఘోరా వెర్షన్ 2.O అనేలా..

  |

  నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సింహా లెజెండ్ వంటి బాక్సాఫీస్ హిట్స్ అనంతరం మూడవ సారి కలిసిన ఈ కాంబినేషన్ అనుకున్నట్టుగానే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఈ కాంబినేషన్ లో నే 4వ సినిమా కూడా ఉంటుందని కూడా దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చేశారు. ఇక సినిమా మల్టీస్టారర్ ప్రాజెక్టుగా రాబోతున్నట్లు కూడా చెప్పేశారు. అయితే అఖండ 2 మెయిన్ స్టోరీ లైన్ ఇదే నంటూ ఒక టాక్ అయితే నడుస్తోంది.

  మాస్ ఎలివేషన్స్

  మాస్ ఎలివేషన్స్

  నందమూరి బాలకృష్ణ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో మాస్ ఎలివేషన్స్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉంటే తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సంచలన విజయాన్ని అందుకుంటుందని బోయపాటి శ్రీను మరోసారి రుజువు చేశాడు. లాజిక్ తో సంబంధం లేకుండా యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులు ఎలా ఇష్టపడతారో ఆయనకు బాగా తెలుసు. అఖండ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా క్లిక్ అయ్యాయి.

  ఎడారిలో విడుదల చేసినా హిట్టే..

  ఎడారిలో విడుదల చేసినా హిట్టే..

  అఖండ సినిమా పై బోయపాటి స్క్రిప్టు రాసుకున్నప్పుడే చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారట. ఇక ఈ సినిమా ఎడారిలో విడుదల చేసినా కూడా తప్పకుండా బాక్సాఫీస్ హిట్ గా నిలుస్తుందని ఇటీవల నిర్వహించిన ఈవెంట్ లో తెలియజేశాడు. సినిమా ప్రతికూల పరిస్థితులలో విడుదల చేసినప్పటికీ కూడా మంచి విజయాన్ని అందుకోవడం చిత్ర యూనిట్ సభ్యులకు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చినట్లుగా తెలియజేశారు.

  అఖండ 2 మల్టీస్టారర్

  అఖండ 2 మల్టీస్టారర్

  ఇక దర్శకుడు బోయపాటి అఖండ సినిమాకు సీక్వెల్ ను రూపొందించబోతున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. అఖండ సీక్వెల్ పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తాడని ఇండస్ట్రీలో టాక్ కూడా వచ్చింది. అయితే ఆ స్టార్ హీరో ఎవరనే విషయంలో మాత్రం ఎవరూ పెద్దగా క్లారిటీ ఇవ్వలేకపోయారు.

  BBBలో.. బన్నీ..?

  BBBలో.. బన్నీ..?

  ఇక ఇటీవల బోయపాటి శ్రీను త్వరలోనే ఈ సినిమాకు మల్టీస్టారర్ సీక్వెల్ తెరపైకి రాబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఆ హీరో బన్నీ అని #BBB అనే తరహాలో ప్రాజెక్ట్ ఉంటుందని కూడా టాక్ వచ్చింది. అదే విషయంపై స్పందించిన బోయపాటి ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చని తప్పకుండా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుందని హింట్ ఇవ్వడంతో ఒక క్లారిటీ వచ్చేసింది.

  సీక్వెల్ మేయిన్ ప్లాట్ స్టోరీ..

  సీక్వెల్ మేయిన్ ప్లాట్ స్టోరీ..

  అయితే అఖండ సీక్వెల్ మెయిన్ స్టోరీ లైన్ పై ప్రస్తుతం అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. బాలకృష్ణ సినిమాలో మురళి కృష్ణ - అఖండ రుద్ర సిఖందర్ అఘోరా అనే పాత్రల్లో ట్విన్స్ గా కనిపించారు. చివరలో మురళి కృష్ణ కూతురికి మళ్ళీ ఎలాంటి ఆపద వచ్చినా కూడా నీ ముందు ఉంటానని మాట ఇచ్చిన అఖండ.. మళ్ళీ ఒక కొత్త సమస్య రావడంతో మళ్ళీ ఎంట్రీ ఇస్తాడట.

  Recommended Video

  Akhanda Collections : Balayya Gets Career Best Numbers || Filmibeat Telugu
  వెర్షన్ 2.O అఘోరా..

  వెర్షన్ 2.O అఘోరా..

  అఖండ సీక్వెల్ లో అఘోరా పాత్ర మరింత హై వోల్టేజ్ గా వెర్షన్ 2.O అనేలా ఉంటుందని తెలుస్తోంది. మరింత బలంగా మారిన అఖండకు కొన్ని క్షుద్ర శక్తులు కూడా అడ్డు పడే ప్రయత్నం చేస్తాయట. ఇక సినిమాలో మరొక హీరో అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉంటుంది అనే విషయంలో ఇంతవరకు క్లారిటీ రాలేదు. స్క్రిప్ట్ పనులు కూడా ఫినిష్ కావాల్సి ఉందట. మరి బోయపాటి ఈ కాంబోను ఎలా తెరపైకి తీసుకు వస్తారో చూడాలి.

  English summary
  Akhanda movie sequel main story plot with allu arjun
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X