Akhanda రికార్డుస్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్.. బాలయ్య మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న అఖండ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్లు, టీజర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమాను దసరా పండగ బరిలో నిలిపేందుకు చిత్రయూనిట్, నిర్మాతలు సిద్ధమయ్యారు. అయితే త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అధికారికంగా క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

హ్యాట్రిక్‌పై దృష్టిపెట్టిన బాలయ్య, బోయపాటి
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సింహా, లెజెండ్ తర్వాత అఖండ వస్తుండటంతో భారీగా అంచనాలు పెరిచాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ హ్యాట్రిక్ విజయాలకు టార్గెట్ సెట్ చేసింది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ లుక్ బయటకు వచ్చిన తర్వాత విభిన్నమైన సినిమా రాబోతున్నది అనే నమ్మకం ఏర్పడింది.

100 శాతం సీటింగ్ కెపాసిటీతో
అభిమానుల అంచనాలకు తగినట్టుగానే అఖండ సినిమాను పూర్తి చేసేందుకు బోయపాటి శ్రీను టీమ్ శ్రమిస్తున్నది. గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను పూర్తి చేసే పనిలో ఉంది. అలాగే ఈ నెల చివరి వరకు ఏపీలో 100 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లను ఓపెన్ చేయడంపై క్లారిటీ వచ్చే నేపథ్యంలో ఈ సినిమాను దసరా బరిలో దించాలని నిర్ణయించినట్టు సమాచారం.

అక్టోబర్ 13వ తేదీన రిలీజ్
అఖండ సినిమా వాస్తవానికి మే 28వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే సెకండ్ వేవ్ కరోనావైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో ఈ సినిమాను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే ఇప్పుడు దసరా బరిలో ఈ సినిమాను నిలిపి అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారనేది తాజా సమాచారం.

హిందూపూర్‌లో అక్టోబర్ 6వ తేదీన
అయితే అఖండ సినిమా ప్రమోషన్స్ ప్లాన్స్ భారీ స్థాయిలో డిజైన్ చేశారనే వార్త అభిమానుల్లో ఆనందాన్ని పంచుతున్నది. అక్టోబర్ 1వ తేదీన అఖండ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయాలి, అలాగే అక్టోబర్ 6వ తేదీన హిందూపూర్‌లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అనే వార్త బయటకు వచ్చింది. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలపై కూడా యూనిట్ క్లారిటీ ఇస్తుందని పేర్కొంటున్నారు.
Recommended Video

57 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్
ఇక అఖండ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ హై రేంజ్‌లో జరిగినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. బాలకృష్ణ కెరీర్‌లోనే ఈ చిత్రం భారీగా బిజినెస్ జరిగిందనే విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆంధ్రా రైట్స్ రూ.35 కోట్లు రేషియో ప్రతిపాదికన, అలాగే నైజాం థియేట్రికల్ హక్కులను రూ.10 కోట్లకు, సీడెడ్ హక్కులను రూ.12 కోట్లకు అమ్మినట్టు తాజా సమాచారం. దాంతో మొత్తంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 57 కోట్ల మేర జరిగాయని, ఓవర్సీస్ ఇతర హక్కుల వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











