twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Akhanda ఖాతాలో మరో సరికొత్త రికార్డు.. సినీ రాజధానిలో బాలయ్య తిరుగులేని పంజా

    |

    బాక్సాఫీస్ బోనాంజా, నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగ రాస్తున్నది. కరోనావైరస్ ప్రతికూలంగా మారిన పరిస్థితులను ఎదురిస్తూ ఈ చిత్రం కలెక్షన్ల తుఫాన్‌ను కురిపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను సరికొత్తగా రాస్తున్నది. ఈ చిత్రం గత 52 రోజుల్లో ఎవరూ ఊహించని కలెక్షన్లను నమోదు చేసింది.

     Akhanda rare record

    అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య అఖండ చిత్రం డిసెంబర్ 2వ తేదీ 2020లో విడుదలైంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 52వ రోజు కూడా 5 లక్షల షేర్‌ను రాబట్టింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 63 కోట్లు షేర్, 105 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల షేర్, 132 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    అఖండ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. 53 కోట్లకుపైగా బిజినెస్‌ను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 54 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే ప్రస్తుతం 20 కోట్లకుపైగా లాభంతో ముందుకెళ్తున్నది.

    Balakrishna movie collected 1 crore at RTC Cross Roads

    అయితే అఖండ చిత్రం మరో రికార్డు సొంతం చేసుకొన్నది. తెలుగు సినిమాకు రాజధానిగా పేరున్న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో కోటి రూపాయలకుపైగా వసూళ్లను నమోదు చేసింది. బాలయ్య కెరీర్‌లో ఇదో రికార్డుగా చెప్పుకోవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    ఇదిలా ఉండగా, జనవరి 21వ తేదీన డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో రిలీజైన అఖండ చిత్రం మరో రికార్డును నమోదు చేసింది. దేశవ్యాప్తంగా ఏ హీరో కూడా సాధించని విధంగా కేవలం 24 గంటల్లోనే బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం పది లక్షల మంది చూడటం ఓటీటీ చరిత్రలో మొదటిసారి అని సినీ వర్గాలు వెల్లడించాయి.

    English summary
    Tollywood film Akhanda created rare collection record. Hero Balakrishna movie collected 1 crore at RTC Cross Roads of Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X