Akhanda రచ్చ.. ఇండియాలోనే కాదు, ఓవర్సీస్ లో కూడా మాస్ జాతర.. 2021లోనే టాప్!
నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''అఖండ''. డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. అలా 'సింహా' 'లెజెండ్' తర్వాత వీరి కాంబోలో హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఓవర్సేస్ వసూళ్లలో రికార్డు సాధించింది. ఆ వివరాల్లోకి వెళితే

అన్నీ కుదరడంతో
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన సినిమా అఖండ. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మామూలు కథే అయినా బాలకృష్ణ గత సినిమాల కంటే భిన్నంగా కనిపించడం, ఫైట్స్, హిందూత్వ సీన్స్ అన్నీ కుదరడంతో 'బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది.

రికార్డు ఓపెనింగ్స్
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్‌ని రాబట్టింది. వారం రోజుల్లోనే రూ. 88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది అఖండ ఇపుడు రూ. 100 కోట్ల గ్రాస్ దిశగా పరుగులు తీస్తోంది. రూ. 54 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ 8వ రోజునే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పటికే అన్ని చోట్లా సేఫ్ జోన్‌కు వచ్చేసిన ఈ చిత్రం. ఏపీలో టికెట్ రేట్స్ తక్కువగా ఉండటంతో కొన్ని చోట్ల మాత్రం బ్రేక్ ఈవెన్‌కు కొద్ది దూరంలో ఉందని అంటున్నారు.

వంద కోట్ల వసూళ్లు దిశగా
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ అఖండ సినిమా అదరగొడుతోంది. వంద కోట్ల వసూళ్లు దిశగా దూసుకుపోతుంది. యూఏస్ 6.8 కోట్లు సాధించిన ఈ సినిమా ఆస్ట్రేలియాలో 1.26 కోట్లు, యునైటెడ్ కింగ్డమ్ 0.72 కోట్లు, యూరప్ 15 లక్షలు, గల్ఫ్ 80 లక్షలు, కెనడా 25 15 లక్షలు, సింగపూర్ 13 లక్షలు, మలేసియా 4 లక్షలు, సౌత్ ఆఫ్రికా- జాంబియా, టాంజానియా, జపాన్ - 5 లక్షలు సాధించాయి. అలా మొత్తం కలిపి మొదటి వారం పదికోట్ల గ్రాస్ సాధించింది.

గ్రాండ్ గా సక్సెస్ మీట్
ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ - జగపతి బాబు - పూర్ణ - నితిన్ మెహతా - కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. 'అఖండ' సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో వైజాగ్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ కూడా జరిగింది.

ఓవర్సీస్ లో హయ్యస్ట్ గ్రాసర్
అఖండ మూవీ కి ఓవర్ సీస్ లో ముందు నుంచీ అనూహ్య స్పందన వచ్చింది. ముందు నుంచే యుఎస్, ఆస్ట్రేలియాల లో లెక్కకు మించి థియేటర్స్ లో రిలీజ్ అవడమే కాదు... అక్కడ ఓవర్ సీస్ లో అఖండ బుకింగ్స్ ఓపెన్ అయిన గంటలోనే థియేటర్స్ లో ఫుల్ గా టికెట్స్ అమ్ముడుపోవడం చూసి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అనుకున్నారు. అనుకున్నట్టుగానే 2021కి గాను ఓవర్సీస్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications