Akhanda Total Collections: అఖండ టోటల్ కలెక్షన్లు.. బాలకృష్ణ మూవీకి లాభం ఎన్ని కోట్లంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ. యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తన పాపులర్ బ్యానర్ ద్వారకా క్రియేషన్స్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్, పూర్ణ, శరత్ లోహితస్వ, సుబ్బరాజు, చమ్మక్ చంద్ర తదితరులు నటించారు.
ఈ మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. థమన్ మ్యూజిక్, సీ రాంప్రసాద్ సినిమాటోగ్రఫి, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిచారు. ఈ చిత్రం 2021 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన రిలీజై భారీ విజయాన్ని అందుకొన్నది. అఖండ 2 చిత్రం డిసెంబర్ 5వ తేదీన రిలీజవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? టోటల్ రన్‌లో సాధించిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

శివతత్వం, సామాజిక అంశాలు, ప్రస్తుత రాజకీయాల్లో సంఘటనలను ఆధారంగా చేసుకొని రూపొందించిన అఖండ సినిమా అన్ని ఖర్చులు కలుపుకొని సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్సాన్స్ రావడంతో బిజినెస్ కూడా భారీగా జరిగింది. అయితే ఈ చిత్రం కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత రావడం కొంత ప్రతికూలంగా మారింది. అప్పట్లో ఏపీ సర్కారు టికెట్ రేట్లు పెంచడానికి నిరాకరించడం తక్కువ రేట్లతోనే బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది.
అఖండ చిత్రం వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 10.5 కోట్లు, సీడెడ్‌లో 10.6 కోట్లు, ఉత్తరాంధ్ర 6 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 4 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3.5 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 5.4 కోట్ల రూపాయలు, కృష్ణా 3.7 కోట్ల రూపాయలు, నెల్లూరు 1.8 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 45.5 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2.5 కోట్ల రూపాయలతో కలిపి మొత్తంగా 53 కోట్ల రూపాయల బిజినెస్ నమోదైంది.
అఖండ చిత్రం వార్ వన్ సైడ్ అన్నట్టు దాదాపు 60 రోజులపాటు ఏకధాటిగా ప్రదర్శించబడింది. ఈ చిత్రం బాక్సాఫీస్ జర్నీని టోటల్‌గా పరిశీలిస్తే..నైజాంలో 21 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 16 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6.5 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 4.22 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.31 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లాలో 4.87 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 3.68 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2.64 కోట్ల రూపాయలు వసూలు చేసింది. థియేట్రికల్ రన్‌ల 105 కోట్ల గ్రాస్, 63.28 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది.
తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 5.2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5.76 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు నెట్.. 133 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాదాపు ఈ చిత్రం 21 కోట్ల రూపాయల లాభాన్ని సాధించి పెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











