Akhanda Pre-release Business: మొదటిసారి భారీ టార్గెట్ తో దిగుతున్న బాలకృష్ణ.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో త్వరలోనే బిగ్ బడ్జెట్ సినిమాల సందడి మొదలు కాబోతుంది. చాలా మంది స్టార్ హీరోలు గత ఏడాది నుంచి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేయలేదు. రికార్డులను బ్రేక్ చేసి కూడా చాలా కాలం అవుతుంది కాబట్టి రానున్న రోజుల్లో మాత్రం సరికొత్త బాక్సాఫీస్ లెక్కలు దర్శనం ఇవ్వబోతునన్నాయని చెప్పవచ్చు. ఇక నందమూరి బాలకృష్ణ కూడా అఖండ సినిమాతో ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో అని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సారి నందమూరి బాలకృష్ణ అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాపై అంచనాలు ఇప్పటికే తారా స్థాయికి చేరుకున్నాయి.

అంచనాలకు మించి..

అంచనాలకు మించి..

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇదివరకే వరుసగా రెండు బాక్స్ ఆఫీస్ హిట్స్ వచ్చాయి. సింహ సినిమా నందమూరి బాలకృష్ణ గత రికార్డులను బ్లాస్ట్ చేయగా అనంతరం లెజెండ్ సినిమా కూడా ఆయనకి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తప్పకుండా ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుంది అని కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు.

బాలయ్య కెరీర్ లోనే..

బాలయ్య కెరీర్ లోనే..

సింహా లెజెండ్ వంటి బాక్సాఫీస్ హిట్స్ అనంతరం బోయపాటి బాలయ్య కాంబోలో రాబోతున్న అఖండపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. బాలయ్య బాక్సాఫీస్ వద్ద భారీ టార్గెట్ తో పోటీ పడనున్నాడు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలపై గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఫైనల్ గా అందుకు సంబంధించిన నెంబర్స్ గట్టిగానే ఉన్నాయి. చూస్తుంటే బాలయ్య కెరీర్ లోనే అఖండ భారీ స్థాయిలో విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ, ఆంధ్రలో భారీగా..

తెలంగాణ, ఆంధ్రలో భారీగా..

సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే బడ్జెట్ ను బట్టి గట్టిగానే సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నైజాంలో 11 కోట్లు, సీడెడ్ లో 12 కోట్లు, ఉత్తరాంధ్రలో 12 కోట్లు, గుంటూరులో 6 కోట్లు, ఈస్ట్ లో 4.8కోట్లు, వెస్ట్ లో 4కోట్లు, కృష్ణ 4.2కోట్లు, నెల్లూరు 2.5కోట్లు.. టోటల్ గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అఖండ సినిమా 51 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ సాధించినట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా..

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 51కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ కాబోతున్న అఖండ సినిమా మిగతా రాష్ట్రాల్లో 5కోట్ల వరకు ధర పలికినట్లు సమాచారం. ఇక ఓవర్సీస్ లో 3కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అఖండ బిజినెస్ 59కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.

Recommended Video

అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Filmibeat Telugu
టార్గెట్ ఎంతంటే..

టార్గెట్ ఎంతంటే..

చూస్తుంటే అఖండ సినిమా నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వాలి అంటే మొత్తంగా 60కోట్లకు పైగా వసూళ్లను అందుకోవాల్సి ఉంటుంది. మరి అఖండ సినిమా ఆ స్థాయిలో వసూళ్లను ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి. ఇక సినిమాను డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X