Agent Collections: ఏజెంట్‌కు షాకింగ్ కలెక్షన్స్.. భారీగా తగ్గిన వసూళ్లు.. మూడో రోజు ఎంతో తెలిస్తే?

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అఖిల్. హీరోగా ఆది నుంచి వరుసగా అపజయాలు మూటగట్టుకుంటూ వస్తున్న అఖిల్ తాజాగా విడుదలైన ఏజెంట్ సినిమాతో అయిన సాలిడ్ హిట్ కొట్టాలని తెగ కష్టపడ్డాడు. అయితే అఖిల్ కష్టానికి, యాక్షన్ సీక్వెన్స్ కు ప్రశంసలు వస్తున్న ఓవరాల్ గా మాత్రం సినిమాకు యావరేజ్ టాక్ వస్తోంది. దీని ప్రభావం కలెక్షన్లపైన పడింది. ఈ నేపథ్యంలో ఏజెంట్ కలెక్షన్స్ సో సోగా సాగుతుండగా మూడో రోజు వసూళ్ల వివరాలు చూద్దాం.

నిర్మాణ సంస్థ:ఏకే ఎంటర్టైన్ మెంట్, సురేందర్ 2 బ్యానర్లపై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి నిర్మించిన చిత్రం ఏజెంట్. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించడంతోపాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించగా సాక్షి వైద్య హీరోయిన్ గా తన గ్లామర్ తో ఆకట్టుకుంది.

Akhil Akkineni Agent Day 3 Expected Worldwide Box Office Collection

థియేటర్ల కౌంట్:అక్కినేని అఖిల్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఏజెంట్ మూవీ కేవలం తెలుగు, మలయాళం భాషల్లో మాత్రమే విడుదలైంది. పలు సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రాన్ని కన్నడ, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కాలేదు. సుమారు రూ. 65 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఏజెంట్ మూవీ వరల్డ్ వైడ్ గా 1100కు పైగా థియేటర్లలో విడుదలైంది.

Akhil Akkineni Agent Day 3 Expected Worldwide Box Office Collection

ప్రీ రిలీజ్ బిజినెస్:అఖిల్ ఏజెంట్ చిత్రానికి నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్ రూ. 4.50 కోట్లు, ఆంధ్రా రూ. 14.80 కోట్ల ఇలా అన్ని ఏరియాలు కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో రూ. 29.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.80 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 3.10 కోట్లతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్ సినిమాకు రూ. 36.20 బిజినెస్ అయింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 37 కోట్లుగా నమోదు అయింది.

Akhil Akkineni Agent Day 3 Expected Worldwide Box Office Collection

ఆక్యుపెన్సీ డీటేల్స్ :స్టైలిష్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన అఖిల్ అక్కినేని ఏజెంట్ చిత్రానికి ఏప్రిల్ 28 నుంచి మిక్స్ డ్ టాక్ వస్తోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఏజెంట్ 3వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ వివరాలు చూస్తే.. తెలుగులో ఉదయం 15.25%, మధ్యాహ్నాం 18.08%, సాయంత్రం 17.46% గా నమోదు అయింది.

Akhil Akkineni Agent Day 3 Expected Worldwide Box Office Collection

3వ రోజు కలెక్షన్స్:సురేందర్ రెడ్డి, అఖిల్ రెండేళ్లు కష్టపడిన ఏజెంట్ సినిమాకు విడుదలైన తొలి రోజు రూ. 5.95 కోట్లు, రెండవ రోజు రూ. 1.6 కోట్లతో ఇండియా నెట్ కలెక్షన్స్ సాధించాయి. ఇక మూడో రోజున రూ. అతి తక్కువగా రూ. 1 కోటి ఇండియా నెట్ కలెక్షన్స్ మాత్రమే సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మొదటి రెండు రోజుల కంటే అతి తక్కువ కలెక్షన్స్ సాధించినట్లుగా అర్థం చేసుకోవచ్చు.

Akhil Akkineni Agent Day 3 Expected Worldwide Box Office Collection

3 రోజుల వసూళ్లు:హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా వచ్చిన ఏజెంట్ సినిమాపై తెలుగు ఆడియెన్స్ పాజిటివ్ గా స్పందించడం లేదు. దీంతో కలెక్షన్స్ భారీగా తగ్గిపోతున్నాయి. ఫలితంగా మూడు రోజుల్లో రూ. 8.55 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టగలిగిందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 5.76 కోట్ల షేర్, రూ. 10.25 కోట్ల గ్రాస్ వసూళు చేయగలిగింది. ఇదే కొనసాగితే అఖిల్ కు మరో ప్లాప్ పడినట్లే అని సినీ వర్గాలు అంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X