Agent Pre Release Bussiness: అఖిల్ కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ టార్గెట్.. ఏమాత్రం తేడా వచ్చినా ఇక అంతే..
అఖిల్ అక్కినేని నటించిన యాక్షన్ మూవీ ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలి అని అఖిల్ ఆశపడుతున్నాడు. ఇక ఏజెంట్ అతని కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా థియేట్రికల్ గా భారీ స్థాయిలోనే బిజినెస్ చేసింది. సినిమాకు భారీ స్థాయిలో పాజిటివ్ టాక్ వస్తేనే సక్సెస్ అయినట్లు లెక్క. లేకపోతే ఏమాత్రం తేడాగా టాక్ వచ్చినా కూడా భారీ స్థాయిలో నష్టాలను చూసే ప్రమాదం కూడా ఉంది. ఇక ఈ సినిమా బిజినెస్ ఏ రేంజ్ లో ఉంది అనే వివరాల్లోకి వెళితే..

ఏజెంట్ బిగ్ కాంబినేషన్: మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాలతో మంచి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సురేందర్ రెడ్డి ఈసారి వక్కంతా వంశీ అందించిన కథతోనే ఏజెంట్ సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు. ఈ సినిమాలో అఖిల్ ఒక స్పైగా కనిపించబోతున్నాడు.
అంతేకాకుండా ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముంటీ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.
ఏజెంట్ బడ్జెట్ ఎంతంటే..: ఇక ఈ సినిమాకు భారీ బడ్జెట్ తోనే నిర్మించాల్సి వచ్చింది. AK ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం. అసలైతే మొదట సినిమాను 50 కోట్ల బడ్జెట్ లోపే ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా సినిమాకు యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఎక్కువ స్థాయిలో ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో మొత్తంగా ఈ సినిమాకు 80 కోట్ల వరకు ఖర్చు అయినట్లు సమాచారం.

ఏపీ, నైజాం బిజినెస్: ఇక ఏజెంట్ సినిమా థియేట్రికల్ గా ఏ స్థాయిలో బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. ముందుగా ఏరియాలో వారిగా చూసుకుంటే.. నైజం ఏరియాలో 10 కోట్ల ధర పలికిన ఈ సినిమా సీడెడ్ లో 4.50 కోట్లు ఆంధ్రాలో 14.0 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే ఏజెంట్ సినిమా 29.30 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా చేసిన బిజినెస్: ఇక కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 3.80 కోట్ల వరకు ఏజెంట్ సినిమా బిజినెస్ అయితే చేసింది. ఇక ఓవర్సీస్ లో 3.10 కోట్ల వరకు ధర పలికినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అఖిల్ ఏజెంట్ సినిమా 36.20 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఒక విధంగా అఖిల్ కెరీర్ లోనే ఇది అత్యధిక స్థాయిలో ఈ బిజినెస్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

టార్గెట్ ఎంతంటే..: ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 36.20 కోట్ల బిజినెస్ చేయడం వలన బ్రేక్ ఈవెన్ 37 కోట్లకు సెట్ అయింది. సినిమా తప్పకుండా 40 కోట్ల రేంజ్ లోనే షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే పెట్టిన పెట్టుబడికి లాభాలు వచ్చినట్లు లెక్క. నిర్మాత అయితే సినిమా కంటెంట్ మీద నమ్మకంతో చాలా ఎక్కువగానే ఖర్చు చేశారు.
ఇక అఖిల్ కు కూడా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. ఎందుకంటే దర్శకుడుతో పాటు అఖిల్ కూడా ఈ సినిమాకు పూర్తిస్థాయిలో పారితోషికం తీసుకోలేదు ఈ సినిమా భారీ స్థాయిలో షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే లాభాల్లో వాటా అందుతుంది. మరి సినిమా ఏ స్థాయిలో ప్రాఫిట్ అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











