Agent Collections: డిజాస్టర్‌గా అఖిల్ ఏజెంట్.. 65 కోట్ల బడ్జెట్‌కు ఎన్ని కోట్ల నష్టమంటే?
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అఖిల్. హీరోగా ఆది నుంచి వరుసగా అపజయాలు మూటగట్టుకుంటూ వస్తున్న అఖిల్ కెరీర్ లో తాజాగా విడుదలైన మూవీ ఏజెంట్. ఈ సినిమాతో అయిన సాలిడ్ హిట్ కొట్టాలని తెగ కష్టపడిన అఖిల్ కు నిరాశే మిగిలిందని చెప్పొచ్చు. అయితే అఖిల్ కష్టానికి, యాక్షన్ సీక్వెన్స్ కు ప్రశంసలు వస్తున్న ఓవరాల్ గా సినిమా మాత్రం ఊహించని టాక్ అందుకుంది. సినిమా మొదటి రోజు నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఏజెంట్ మూవీ టోటల్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
నటీనటులు: ఏకే ఎంటర్టైన్ మెంట్, సురేందర్ 2 బ్యానర్లపై అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి నిర్మించిన చిత్రం ఏజెంట్. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించడంతోపాటు నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, డినో మోరియా, వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించగా సాక్షి వైద్య హీరోయిన్ గా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. తమన్ మ్యూజిక్ అందించారు.

థియేటర్ల కౌంట్: అక్కినేని అఖిల్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఏజెంట్ మూవీ కేవలం తెలుగు, మలయాళం భాషల్లో మాత్రమే విడుదలైంది. పలు సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రాన్ని కన్నడ, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కాలేదు. సుమారు రూ. 65 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఏజెంట్ సినిమాను వరల్డ్ వైడ్ గా 1100కు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.
ప్రీ రిలీజ్ బిజినెస్: ఏజెంట్ చిత్రానికి నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్ రూ. 4.50 కోట్లు, ఆంధ్రా రూ. 14.80 కోట్ల ఇలా అన్ని ఏరియాలు కలుపుకుని తెలుగు రాష్ట్రాల్లో రూ. 29.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.80 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 3.10 కోట్లతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్ సినిమాకు రూ. 36.20 బిజినెస్ అయింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 37 కోట్లుగా నమోదు అయింది.

తెలుగు రాష్ట్రాల్లో: స్టైలిష్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన అఖిల్ అక్కినేని ఏజెంట్ చిత్రానికి ఏప్రిల్ 28న అంటే తొలి రోజున రూ. 4 కోట్ల వసూళు సాధించింది. తర్వాత క్రమంగా కలెక్షన్స్ తగ్గాయి. ఫలితంగా టోటల్ గా నైజాంలో రూ. 1.70 కోట్లు, సీడెడ్ రూ. 86 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 90 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ. 46 లక్షలు, వెస్ట్ రూ. 40 లక్షలు, గుంటూరు రూ. 72 లక్షలు, క్రష్ణాలో రూ. 37 లక్షలు, నెల్లూరు రూ. 24 లక్షళు వచ్చాయి. అంటే తెలుగు రాష్ట్రాల్లో అన్ని రోజులకు కలిపి మొత్తంగా రూ. 5.65 కోట్ల షేర్, రూ. 10.65 లక్షల గ్రాస్ నమోదు అయింది.
వరల్డ్ వైడ్ గా: సురేందర్ రెడ్డి, అఖిల్ రెండేళ్లు కష్టపడిన ఏజెంట్ సినిమాకు విడుదలైన తొలి రోజున రూ. 4.95 కోట్లు షేర్ వచ్చింది. టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.65 కోట్లు, కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 40 లక్షలు, ఓవర్సీస్ లో రూ. 80 లక్షలు వసూళు అయ్యాయి. ఇలా అన్ని రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 6.90 కోట్ల షేర్, రూ. 13.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను ఏజెంట్ రాబట్టగలిగింది.

నష్టం ఎంతంటే?: అఖిల్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ. 36.20 కోట్ల బిజినెస్ కాగా.. రూ. 37 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. కానీ సినిమాకు మొత్తంగా వచ్చింది రూ. 6.90 కోట్ల షేర్ మాత్రమే. అంటే ఏజెంట్ నిర్మాతలు అనిల్ సుంకర, సురేందర్ రెడ్డిలకు రూ. 30.10 లక్షల నష్టం వచ్చి మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











