Agent Collections అఖిల్ మూవీకి నెగిటివ్ టాక్.. అయినా తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ చిత్రం భారీ అంచనాలతో ఏప్రిల్ 28వ తేదీన రిలీజైంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్, స్పై, థ్రిల్లర్ మూవీలో నూతన నటి సాక్షి వైద్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందింది. అయి ఈ సినిమాపై ఏర్పడిన భారీ అంచనాలను అఖిల్, సురేందర్ రెడ్డి టీమ్ చేరుకొన్నాదా? ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల ఏ రేంజ్‌లో రాబట్టిందనే వివరాల్లోకి వెళితే..

తెలుగు, మలయాళంలో రిలీజ్: పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఏజెంట్ సినిమా కేవలం తెలుగు, మలయాళం భాషల్లో రిలీజైంది. సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా కన్నడ, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు నోచుకోలేదు. అయితే దాదాపు 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100కుపైగా స్క్రీన్లలో రిలీజైంది. అఖిల్ కెరీర్‌లో దాదాపు హయ్యెస్ట్ స్క్రీన్ కౌంట్ రిలీజ్‌గా చెప్పుకోవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఏజెంట్ ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే?: ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం 37.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 36.5 కోట్ల బిజినెస్ చేసింది. నైజాంలో 11 కోట్లు, సీడెడ్‌లో 4.5 కోట్లు, ఓవర్సీస్‌లో 3.5 కోట్లు, ఆంధ్రాలో 15 కోట్లుగా బిజినెస్ చేసింది. అయితే విడుదల తర్వాత ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టడం తొలి రోజు వసూళ్లపై భారీ ప్రభావమే పడింది.

ఏపీ, తెలంగాణ, కేరళలో ఆక్యుపెన్సీ: ఏజెంట్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మధ్యస్తంగా, కేరళలో పేలవమైన ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 40 శాతానికిపైగా ఆక్యుపెన్సీని నమోదు చేసుకోగా, కేరళలో ఈ చిత్రం 10 శాతం కంటే అధికంగా ఆక్యుపెన్సీని రిజిస్టర్ చేసింది. కేరళలో మమ్ముట్టి కూడా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించలేకపోయారనేది ఆక్యుపెన్సీ స్పష్టం చేసింది. పొన్నియన్ సెల్వన్ సినిమా పోటీగా మారడంతో ఈ చిత్ర కలెక్షన్లకు ప్రతికూలంగా మారింది.

ఏపీ, నైజాంలో తొలి రోజు కలెక్షన్లు: ఏపీ, తెలంగాణలో ఏజెంట్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు నైజాంలో ఈ చిత్రం 1.10 కోట్ల షేర్, 2.35 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక కృష్ణా జిల్లాలో 21 లక్షలు, గుంటూరులో 52 లక్షలు, ఉత్తరాంధ్రాలో 54 లక్షలు, నెల్లూరులో 16 లక్షలు, సీడెడ్‌లో 64 లక్షలు, తిరుపతిలో 6.5 లక్షలు రాబట్టింది. ఇంకా పలు ప్రదేశాల్లో కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సుమారు 6.5 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?: ఇక ఏజెంట్ కర్ణాటక, మలయాళం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం కేరళలో తొలి రోజు 5 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. ఇక కర్ణాటకలో ఈ చిత్రం 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. అమెరికా, ఆస్ట్రేలియాలతో కలుపుకొంటే 1 కోటి రూపాయలు రాబట్టినట్టు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అంటే ఓవర్సీస్‌తో కలుపుకొని 8.5 కోట్ల గ్రాస్ నమోదు చేసినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











