Agent Advance Booking Collections అఖిల్ ముందు భారీ టార్గెట్.. యూఎస్, ఏపీ, నైజాంలో పరిస్థితి ఏమిటంటే?

అక్కినేని నటవారసుడు అఖిల్ అక్కినేని, నూతన హీరోయిన్ సాక్షి వైద్య జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన చిత్రం ఏజెంట్. స్పై, సస్సెన్స్, థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ కార్యక్రమాలకు మంచి రెస్సాన్స్ కనిపించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

ఏజెంట్ మూవీ బడ్జెట్ ఏమిటంటే? :ఏజెంట్ సినిమా షూటింగ్‌కు అనుకోని అవాంతరాలు ఎదురుపడటంతో ఈ సినిమా జర్నీ రెండేళ్లుగా సెట్స్‌లోనే సాగింది. కరోనావైరస్ పరిస్థితులు, అఖిల్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, దర్శకుడు సురేందర్ రెడ్డి అనారోగ్యానికి గురికావడం ఈ సినిమా రిలీజ్‌ ఆలస్యం కావడానికి కారణాలుగా మారాయి. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారు 80 కోట్ల రూపాయలు అయిందనే ట్రేడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతున్నది.

Akhil Akkinenis Agent Advance Booking Collections worldwide

ఏజెంట్ ప్రీరిలీజ్ బిజినెస్:ఇక అఖిల్ అక్కినేని సినిమాల బిజినెస్ వివరాల్లోకి వెళితే.. అఖిల్ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బిజినెస్ 50 కోట్లుగా అయిందని చెప్పుకొంటారు. ఇక హల్లో సినిమాకు 32 కోట్లు, మిస్టర్ మజ్ను సినిమాకు 23 కోట్ల థియేట్రికల్ బిజినెస్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌కు 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఏజెంట్ సినిమాకు 60 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్:ఇక ఏజెంట్ సినిమా ప్రీమియర్లకు సంబంధించిన అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమాను 81 లోకేషన్లలో ప్రదర్శిస్తుండగా, 135 షోలు స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే 9 వేల అమెరికన్ డాలర్లను రాబట్టింది. ఇంకా మూడు రోజులు సమయం ఉన్నందున ఇంకా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

Akhil Akkinenis Agent Advance Booking Collections worldwide

హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్:ఏజెంట్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ హైదరాబాద్, వైజాగ్ లాంటి పట్టణాల్లో మంచి రెస్సాన్స్ కనిపిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను 67 షోలుగా తొలి రోజు ప్రదర్శించబోతున్నారు. దాదాపు ఇప్పటికే 24 శాతం అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. దాంతో 18 లక్షల కలెక్షన్లు నమోదయ్యాయి. ఇంకా మూడు రోజుల వ్యవధి ఉంది కాబట్టి భారీగా బుకింగ్ జరగడానికి అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో సోమవారం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Akhil Akkinenis Agent Advance Booking Collections worldwide

అఖిల్ మూవీకి భారీ పోటీ:అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాకు భారీ పోటీ ఏర్పడింది. ఈ సినిమాకు పోటీగా పొన్నియన్ సెల్వన్ 2, రిలీజ్ అవుతున్నది. అయితే ఈ పోటీని తట్టుకొని అఖిల్ బాక్సాఫీస్ వద్ద నిలబడతారా అనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ సినిమాతో మంచి హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఉండటంతో ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X