Most Eligible Bachelor Day1 Collections: అఖిల్ మూవీకి ఊహించని వసూళ్లు.. ఇండియాలోనే రెండో స్థానం
హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతోన్నా ఒక్కటంటే ఒక్క విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు అక్కినేని వారసుడు అఖిల్. హ్యాండ్సమ్ లుక్స్‌తో పాటు యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ చేయగల నైపుణ్యం ఉన్నా ఎందుకనో మనోడు సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. పూర్తి స్థాయి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన మొదటి రోజు బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ‘బ్యాచ్‌లర్’
అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఎన్నో అంచనాలతో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

హిట్ లేకున్నా భారీ బిజినెస్ చేసుకుని
అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.50 కోట్ల వ్యాపారం జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కలిపి దీనికి రూ. కోటి బిజినెస్ జరిగిందట. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 18.50 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

అంచనాలు భారీగా.. టాక్ కూడా అలాగే
ఫీల్ గుడ్ రొమాంటిక్ జోనర్‌లో అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.

మొదటి రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే
అఖిల్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 61 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 30 లక్షలు, గుంటూరులో రూ. 52 లక్షలు, కృష్ణాలో రూ. 31 లక్షలు, నెల్లూరులో రూ. 23 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 5.45 కోట్లు షేర్, రూ. 9.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంత
తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 5.45 కోట్లు కొల్లగొట్టిన 'బ్యాచ్‌లర్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటాడు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 51 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 84 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 6.80 కోట్లు షేర్‌తో పాటు రూ. 11.90 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఎంత రావాలి
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు ఈ సినిమాకు రూ. 6.80 కోట్లు రాబట్టింది. అంటే మరో 12.20 కోట్లు వస్తే క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

ఇండియాలోనే రెండో సినిమా గొప్ప రికార్డ్
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీకి మొదటి రోజే రూ. 9.10 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో సెకెండ్ వేవ్ తర్వాత విడుదలైన చిత్రాల్లో ఎక్కువ వసూలు చేసిన రెండో ఇండియన్ మూవీగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. దీనికంటే ముందు రూ. 11 కోట్లతో 'లవ్ స్టోరీ' ఉండగా.. తర్వాత 'సీటీమార్' రూ. 5 కోట్లతో రెండో స్థానంలో.. 'సాంగ్ చీ' రూ. 4.15 కోట్లతో మూడో స్థానంలో, 'బెల్‌బాటమ్' రూ. 3.55 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











