twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Most Eligible Bachelor Collections: రెండో వారంలో అఖిల్‌కు బిగ్ షాక్.. థియేటర్లు పెరిగినా వసూళ్లిలా!

    |

    చాలా కాలం క్రితమే హీరోగా పరిచయమైనా.. విజయం కోసం ఎన్నో ఏళ్లుగా పరితపించాడు అక్కినేని వారసుడు అఖిల్. హ్యాండ్సమ్‌ లుక్స్‌తో పాటు హీరో మెటీరియల్ అయినప్పటికీ.. ఎందుకనో అతడు అంతగా సక్సెస్ కాలేకపోయాడు. ఈ క్రమంలోనే ఫలితాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ, విజయం మాత్రం అందనంత దూరంలోనే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రంతో అతడు మొదటి హిట్‌ను సొంతం చేసుకోవడంతో పాటు టాలీవుడ్‌లో జోష్‌ను నింపాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎనిమిదో రోజు ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం పదండి!

    మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా అఖిల్

    మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా అఖిల్

    బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.

    <strong>Radhe Shyam Teaser: ట్విస్ట్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్.. విక్రమాదిత్య ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!</strong><br />Radhe Shyam Teaser: ట్విస్ట్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్.. విక్రమాదిత్య ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!

     హిట్ లేకున్నా బిజినెస్ ఓ రేంజ్‌లో

    హిట్ లేకున్నా బిజినెస్ ఓ రేంజ్‌లో

    అక్కినేని అఖిల్‌కు ఒక్క హిట్ కూడా లేదు. అయినప్పటికీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.80 కోట్ల వ్యాపారం జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగానే ప్రభావం చూపింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కలిపి దీనికి రూ. కోటి బిజినెస్ జరిగిందట. వీటితో మొత్తంగా దీనికి రూ. 18.80 కోట్ల బిజినెస్ జరుపుకుందట.

    అంచనాలకు తగ్గట్లే.. రెండో వారంలో

    అంచనాలకు తగ్గట్లే.. రెండో వారంలో

    అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీంతో రెండో వారంలో అన్ని ప్రాంతాల్లో థియేటర్ల సంఖ్యను బాగా పెంచేశారు.

    అరాచకమైన ఫొటోను వదిలిన పూజా హెగ్డే: ఒక పక్క విప్పేసి మరీ.. ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!అరాచకమైన ఫొటోను వదిలిన పూజా హెగ్డే: ఒక పక్క విప్పేసి మరీ.. ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

     8వ రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

    8వ రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

    అఖిల్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదో రోజు కలెక్షన్లు బాగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 7 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1.10 లక్షలు, కృష్ణాలో రూ. 2.40 లక్షలు, నెల్లూరులో రూ. 60 వేలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 19 లక్షలు షేర్, రూ. 32 లక్షలు గ్రాస్ వచ్చింది.

     8 రోజులకు ఎక్కడ.. ఎంత వచ్చింది

    8 రోజులకు ఎక్కడ.. ఎంత వచ్చింది

    'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీకి ఎనిమిది రోజుల్లో నైజాంలో రూ. 7.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.75 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.18 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.11 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 90 లక్షలు, గుంటూరులో రూ. 1.27 కోట్లు, కృష్ణాలో రూ. 1 కోట్లు, నెల్లూరులో రూ. 76 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 18.04 కోట్లు షేర్‌తో పాటు రూ. 29.72 కోట్లు గ్రాస్ వచ్చింది.

    <strong>Bigg Boss: బిగ్ బాస్ సీక్రెట్స్ తెలుసుకున్న రవి.. టాప్‌ 5లో ఉండే కంటెస్టెంట్లు ఎవరో చెప్పేశాడుగా!</strong><br />Bigg Boss: బిగ్ బాస్ సీక్రెట్స్ తెలుసుకున్న రవి.. టాప్‌ 5లో ఉండే కంటెస్టెంట్లు ఎవరో చెప్పేశాడుగా!

     ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

    'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.04 కోట్లు కొల్లగొట్టింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.36 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.26 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 8 రోజుల్లో దీనికి రూ. 21.66 కోట్లు షేర్‌తో పాటు రూ. 36.10 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి రికార్డులు కొట్టేసింది.

     బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వచ్చిందిలా

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వచ్చిందిలా

    క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి రూ. 21.66 కోట్లు వచ్చాయి. దీంతో దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.66 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

    English summary
    Tollywood Young Hero Akhil Akkineni Did Most Eligible Bachelor Under Bommarillu Bhaskar. This Movie Collect Rs 21.66 Crore in 8 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X