Most Eligible Bachelor Collections: మళ్లీ పెరిగిన బ్యాచ్‌లర్ వసూళ్లు.. 9రోజుల్లోనే అన్ని కోట్ల లాభం

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై.. చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు నాగార్జున కుమారుడు అఖిల్. ఒక హీరోకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నా.. ఎందుకనో అతడు అంతగా సక్సెస్ కాలేకపోయాడు. ఈ క్రమంలోనే ఫలితాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ, విజయం మాత్రం అందనంత దూరంలోనే ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రంతో అతడు మొదటి హిట్‌ను సొంతం చేసుకోవడంతో పాటు టాలీవుడ్‌లో జోష్‌ను నింపాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తొమ్మిదో రోజు ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం పదండి!

బ్యాచ్‌లర్‌ అంటూ వచ్చేసిన అఖిల్

బ్యాచ్‌లర్‌ అంటూ వచ్చేసిన అఖిల్

బొమ్మరిల్లు భాస్కర్ - అక్కినేని అఖిల్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హిట్ లేకున్నా బిజినెస్ ఓ రేంజ్‌లో

హిట్ లేకున్నా బిజినెస్ ఓ రేంజ్‌లో

ఒక్క హిట్ కూడా లేకపోయినా అక్కినేని అఖిల్‌ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.90 కోట్ల వ్యాపారం జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగానే ప్రభావం చూపింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కలిపి దీనికి రూ. కోటి బిజినెస్ జరిగిందట. వీటితో మొత్తంగా దీనికి రూ. 19.90 కోట్ల బిజినెస్ జరుపుకుంది.

అంచనాలకు తగ్గట్లే.. రెండో వారంలో

అంచనాలకు తగ్గట్లే.. రెండో వారంలో

అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీంతో రెండో వారంలో అన్ని ప్రాంతాల్లో థియేటర్ల సంఖ్యను బాగా పెంచేశారు.

9వ రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

9వ రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

అఖిల్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు కలెక్షన్లు బాగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2.60 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 1.60 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 32 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ వచ్చింది.

 9 రోజులకు ఎక్కడ.. ఎంత వచ్చింది

9 రోజులకు ఎక్కడ.. ఎంత వచ్చింది

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'కు తొమ్మిది రోజుల్లో నైజాంలో రూ. 7.17 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.81 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.22 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.14 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 92 లక్షలు, గుంటూరులో రూ. 1.29 కోట్లు, కృష్ణాలో రూ. 1.03 కోట్లు, నెల్లూరులో రూ. 78 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 18.36 కోట్లు షేర్‌తో పాటు రూ. 30.22 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత


'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.36 కోట్లు కొల్లగొట్టింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.39 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.30 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 9 రోజుల్లో దీనికి రూ. 22.05 కోట్లు షేర్‌తో పాటు రూ. 36.80 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి రికార్డులు కొట్టేసింది.

Recommended Video

Date With Akhil Tour | Akhil Interaction With Crazy Girls
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వచ్చిందిలా

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వచ్చిందిలా


క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 19.90 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 22.05 కోట్లు వచ్చాయి. దీంతో దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 3.05 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X