Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మిస్టర్ మజ్ను 4 రోజుల కలెక్షన్లు.. ఎంత వసూలు చేసిందంటే..
అక్కినేని అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గత రెండు చిత్రాలు నిరాశపరచడంతో అఖిల్ తొలి హిట్ అందుకోవాలనే కోరిక మూడవ చిత్రానికి వాయిదా పడింది. తొలిప్రేమ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు కావడం, టీజర్, ట్రైలర్స్ బావుండడంతో ఈసారి అఖిల్ హిట్ కొట్టడం పక్కా అని అంతా భావించారు. కానీ మిస్టర్ మజ్ను చిత్రానికి తొలి రోజునుంచే డివైడ్ టాక్ స్ప్రెడ్ అయింది. దీనితో మిస్టర్ మజ్ను చిత్రానికి బాక్సాఫీస్ వద్ద ఎదురీత తప్పడం లేదు.
తొలి వీకెండ్
మిస్టర్ మజ్ను చిత్రానికి తొలి వీకెండ్ నిరాశా జనకంగా ముగిసింది. ఓపెనింగ్స్ కూడా అఖిల్ గత చిత్రాల స్థాయిలో నమోదు కాలేదు. తొలి వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం 9.6 కోట్ల షేర్ ని ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. దీనితో సినిమా భవితవ్యం సోమవారం రోజు ఎలాంటి వసూళ్లు రాబడతాయనే దానిపై ఆధారపడింది. కానీ సోమవారం మిస్టర్ మజ్ను వసూళ్ళలో డ్రాప్ ఎక్కువగా కనిపించింది. దీనితో ఈ చిత్రం ఫుల్ రన్ లో నష్టాలతోనే ముగుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మండే రోజు పరిస్థితి
సోమవారం రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కేవలం కోటి షేర్ మాత్రమే రాబట్టింది. వీక్ డేస్ లో మిస్టర్ మజ్ను చిత్రం వసూళ్లు సాధించడానికి ఎలా ఇబ్బంది పడుతుందో అర్థం అయిపోయింది. మిస్టర్ మజ్ను చిత్రం ఫుల్ రన్ లో 15 కోట్ల వద్ద ఆగిపోనుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్ర బయ్యర్లంతా 30 శాతం వరకు నష్టాలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక యూఎస్ లో ఈ చిత్ర పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇంకా ఈ చిత్రం 3 లక్షల డాలర్ల మార్క్ ని కూడా అందుకోలేదు. యూఎస్ లో డిస్ట్రిబ్యూటర్ సేవ్ అవ్వాలంటే మిస్టర్ మజ్ను కనీసం 1 మిలియన్ మార్క్ అందుకోవాల్సి ఉంటుంది. కానీ అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.
'మిస్టర్ మజ్ను' వీకెండ్ కలెక్షన్స్.. ఇంకా సగానికిపైగా, సేవ్ అయ్యే ఛాన్స్ ఉందా!
లిమిటెడ్గానే ప్రీరిలీజ్ బిజినెస్
అఖిల్ తొలి రెండు చిత్రాల మాదిరిగా ఈ చిత్ర బిజినెస్ హద్దులు దాటకుండా జాగ్రత్త పడ్డారు. మిస్టర్ మజ్ను చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. హిట్ టాక్ వచ్చి ఉంటే మంచి వసూళ్లు నమోదై బయ్యర్లు లాభాల బాట పట్టేవారు. కానీ అలా జరగలేదు. అఖిల్ ని మరోమారు పరాజయం వెంటాడింది.
అఖిల్‌కు ప్రశంసలు
మిస్టర్ మజ్ను చిత్రంలో అఖిల్ పెర్ఫామెన్స్ కు మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి. అఖిల్ తన స్టైలింగ్, హావభావాలు, నటన విషయంలో ఈ చిత్రంలో చాలా పరిణితి సాధించాడని అంటున్నారు. అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ మిస్టర్ మజ్నుకు మంచి సంగీతాన్ని అందించాడు.