మిస్టర్ మజ్ను ఫస్ట్ డే కలెక్షన్స్.. అఖిల్ కెరీర్‌లోనే తక్కువగా!

Recommended Video

Mr Majnu First Day Collections Report | Filmibeat Telugu

అఖిల్ అక్కినేని నటించిన మిస్టర్ మజ్ను చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిప్రేమ చిత్రంతో హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని కూడా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందించాడు. మిస్టర్ మజ్ను చిత్రానికి ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో మిస్టర్ మజ్ను వసూళ్లు ఏస్థాయిలో ఉంటాయనే ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉండడంతో ఓపెనింగ్స్ బావుంటాయని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ మిస్టర్ మజ్ను చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా కలెక్షన్స్ ప్రారంభించింది. తొలి రోజు వసూళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం!

రొమాంటిక్ లవ్ స్టోరీ

రొమాంటిక్ లవ్ స్టోరీ

తొలి రెండు చిత్రాలు నిరాశపరచడంతో అఖిల్ తన మూడవ చిత్రం కోసం రొమాంటిక్ లవ్ స్టోరీని ఎంచుకున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తమన్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ చిత్ర తొలి రోజు వసూళ్లు మాత్రం యావరేజ్ గానే ప్రారంభమయ్యాయి. అఖిల్ గత చిత్రాలతో పోల్చుకుంటే మిస్టర్ మజ్ను ఓపెనింగ్ డే వసూళ్లు తక్కువగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో

రెండు తెలుగు రాష్ట్రాల్లో మిస్టర్ మజ్ను చిత్రం తొలి రోజు 3 కోట్ల షేర్ సాధించింది. మొదటి చిత్రం అఖిల్ కు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఫస్ట్ డే షేర్ 7 కోట్లు. ఆ తర్వాత హలొ చిత్రం 3.2 కోట్ల వరకు షేర్ రాబట్టింది. కానీ మిస్టర్ మజ్ను చిత్రం కేవలం 3 కోట్లకే పరిమితమైంది. వీకెండ్ ఇంకా ఉండడంతో మిస్టర్ మజ్ను చిత్రం పుంజుకుంటుందేమో చూడాలి. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 4.5 కోట వరకు షేర్ వచ్చినట్లు తెలుస్తోంది.

 ఏరియాల వారీగా

ఏరియాల వారీగా

మిస్టర్ మజ్ను చిత్రం నైజాం ఏరియాలో ఆశించిన జోరు ప్రదర్శించలేదు. ఇక్కడ తొలి రోజు కేవలం 90 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఇక ఆంధ్రాలో కొంతవరకు పరవాలేదని చెప్పొచ్చు. సీడెడ్ లో 40లక్షలు, ఉత్తరాంధ్రలో 41, గుంటూరులో 54 లక్షలు, ఈస్ట్ లో 20, వెస్ట్ లో 15 లక్షలు రాబట్టింది. ఈ వీకెండ్ లో మిస్టర్ మజ్ను సాధించే వసూళ్ళకి బట్టి ఈ చిత్ర ఫలితం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు.

ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే

ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే

మిస్టర్ మజ్ను చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ హద్దులోనే జరిగింది. మితిమీరిన మొత్తానికి ఎవరూ ఈ చిత్రాన్ని కొనలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 24 కోట్ల వరకు జరిగింది. వీకెండ్ లో ఈ చిత్రం కాస్త జోరు కనబరిచి, వీక్ డేస్ లో స్టడీగా కొనసాగితే టార్గెట్ అందుకునే అవకాశం ఉంది. కానీ ఆడియన్స్ నుంచి, సినీ క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్న తరుణంలో ఏమేరకు రాణిస్తుందనేది ప్రశ్నగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X