twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Most Eligible Bachelor Collections: ఆ మార్కును చేరుకుని అఖిల్ రికార్డు.. 12 రోజుల్లోనే అన్ని కోట్లు

    |

    చాలా చిన్న వయసులోనే 'సిసింద్రీ'గా మెప్పించి.. కొన్నేళ్ల క్రితం 'అఖిల్' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని వారసుడు అఖిల్. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత అతడు 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి సినిమాలను చేశాడు. కానీ, అవేమీ అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు. అయినప్పటికీ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చాడు.

    ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రంతో అతడు మొదటి హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా పన్నెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం పదండి!

     ‘బ్యాచ్‌లర్‌'గా మారిన హీరో అఖిల్

    ‘బ్యాచ్‌లర్‌'గా మారిన హీరో అఖిల్

    బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటించిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చాడు. దీన్ని దసరా పండుగ కానుకగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

    టాప్ విప్పేసి షాకిచ్చిన అషు రెడ్డి: లోదుస్తులు కూడా లేకుండా ఫోజు.. వామ్మో మరీ ఇంత ఘోరమా!టాప్ విప్పేసి షాకిచ్చిన అషు రెడ్డి: లోదుస్తులు కూడా లేకుండా ఫోజు.. వామ్మో మరీ ఇంత ఘోరమా!

    హిట్ లేకున్నా బిజినెస్ ఓ రేంజ్‌లో

    హిట్ లేకున్నా బిజినెస్ ఓ రేంజ్‌లో

    అక్కినేని అఖిల్‌కు ఈ చిత్రానికి ముందు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. అయినప్పటికీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.50 కోట్ల వ్యాపారం జరుపుకుంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కలిపి దీనికి రూ. కోటి బిజినెస్ జరిగిందట. వీటితో కలుపుకుంటే మొత్తంగా దీనికి రూ. 18.50 కోట్ల వ్యాపరం జరిగిందని తెలిసింది.

    అంచనాలకు తగ్గట్లే.. రెండో వారంలో

    అంచనాలకు తగ్గట్లే.. రెండో వారంలో

    రొమాంటిక్ జోనర్‌లో అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'పై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. ఇక, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ అయింది. కలెక్షన్ల పరంగానూ సత్తా చాటింది. దీంతో రెండో వారంలో అన్ని ప్రాంతాల్లో థియేటర్ల సంఖ్యను బాగా పెంచేశారు.

    Bigg Boss: ఐదో సీజన్ విన్నర్ అతడే.. టాప్ 5లో ఉండే కంటెస్టెంట్లు వాళ్లే.. ఈ లెక్కలు చూస్తే షాకే!Bigg Boss: ఐదో సీజన్ విన్నర్ అతడే.. టాప్ 5లో ఉండే కంటెస్టెంట్లు వాళ్లే.. ఈ లెక్కలు చూస్తే షాకే!

    12వ రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

    12వ రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

    అఖిల్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజు కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. మొదటి రోజు రూ. 5.45 కోట్లు, 2వ రోజు రూ. 4.54 కోట్లు, 3వ రోజు రూ. 4.03 కోట్లు, 4వ రోజు 1.59 కోట్లు, 5వ రోజు 1.31 కోట్లు, 6వ రోజు 57 లక్షలు, 7వ రోజు 36 లక్షలు, 8వ రోజు 19 లక్షలు, 9వ రోజు 32 లక్షలు, 10వ రోజు 51 లక్షలు, 11వ రోజు 24 లక్షలు, 12వ రోజు 15 లక్షలతో మొత్తం రూ. 19.26 కోట్లు షేర్, రూ. 31.68 కోట్లు గ్రాస్ వచ్చింది.

    12 రోజులకు ఎక్కడ.. ఎంత వచ్చింది

    12 రోజులకు ఎక్కడ.. ఎంత వచ్చింది

    'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'కు పన్నెండు రోజుల్లో నైజాంలో రూ. 7.46 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.98 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.33 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.21 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 98 లక్షలు, గుంటూరులో రూ. 1.37 కోట్లు, కృష్ణాలో రూ. 1.10 కోట్లు, నెల్లూరులో రూ. 83 లక్షలతో.. ఏపీ తెలంగాలో కలుపుకుని రూ. 19.26 కోట్లు షేర్, రూ. 31.68 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    Bigg Boss: బెడ్ మీద లేకపోతే ఆ రూమ్‌లో.. మీ అమ్మ కూడా అలాగే.. షణ్ముఖ్‌పై రవి షాకింగ్ కామెంట్స్Bigg Boss: బెడ్ మీద లేకపోతే ఆ రూమ్‌లో.. మీ అమ్మ కూడా అలాగే.. షణ్ముఖ్‌పై రవి షాకింగ్ కామెంట్స్

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

    'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 19.26 కోట్లు కొల్లగొట్టింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.47 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.35 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 12 రోజుల్లో దీనికి రూ. 23.08 కోట్లు షేర్‌తో పాటు రూ. 38.70 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి రికార్డులు కొట్టేసింది.

    Recommended Video

    Date With Akhil Tour | Akhil Interaction With Crazy Girls
    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వచ్చిందిలా

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వచ్చిందిలా

    అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో దీనికి రూ. 23.08 కోట్లు వచ్చాయి. దీంతో నాలుగు కోట్ల లాభాల మైలురాయిని చేరుకుంది. దీనికి ఇప్పటికి రూ. 4.08 కోట్లు ప్రాఫిట్ వచ్చింది.

    English summary
    Tollywood Young Hero Akhil Akkineni Did Most Eligible Bachelor Under Bommarillu Bhaskar. This Movie Collect Rs 23.08 Crore in 12 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X