Most Eligible Bachelor Collections: 19 కోట్ల టార్గెట్.. మూడు రోజుల్లోనే అంత.. టాలీవుడ్‌లో 4వ స్థానం

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఇప్పటి వరకూ ఎంతో మంది స్టార్ హీరోలు తమ వారసులను పరిచయం చేశారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్ స్టేటస్‌ను అందుకున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం ఇప్పటికీ తంటాలు పడుతూనే ఉన్నారు. అలాంటి వారిలో అక్కినేని నట వారసుడు అఖిల్ ఒకడు. చాలా కాలం క్రితమే హీరోగా పరిచయం అయినా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాను చేశాడు. దసరా కానుకగా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మూడు రోజుల బాక్సాఫీస్ రిపోర్టును పరిశీలిద్దాం పదండి!

‘బ్యాచ్‌లర్'గా వచ్చిన అక్కినేని అఖిల్

‘బ్యాచ్‌లర్'గా వచ్చిన అక్కినేని అఖిల్

అక్కినేని అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఎన్నో అంచనాలతో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

సక్సెస్ లేకున్నా భారీ బిజినెస్ జరిగింది

సక్సెస్ లేకున్నా భారీ బిజినెస్ జరిగింది

అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.50 కోట్ల వ్యాపారం జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగానే ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కలిపి దీనికి రూ. కోటి బిజినెస్ జరిగిందట. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 18.50 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

భారీ అంచనాలతో... టాక్ కూడా అలాగే

భారీ అంచనాలతో... టాక్ కూడా అలాగే

ఫీల్ గుడ్ రొమాంటిక్ జోనర్‌లో అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ వచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.

మూడో రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

మూడో రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

అఖిల్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజూ భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 86 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 52 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 23 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 4.03 కోట్లు షేర్, రూ. 6.80 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంత

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంత

మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 14.02 కోట్లు కొల్లగొట్టిన 'బ్యాచ్‌లర్' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటాడు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.12 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.10 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మూడు రోజుల్లో దీనికి రూ. 17.24 కోట్లు షేర్‌తో పాటు రూ. 29 కోట్లు గ్రాస్ వచ్చింది. దీంతో రికార్డులు బద్దలయ్యాయి.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఎంత రావాలి

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఎంత రావాలి

ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజుల్లో దీనికి రూ. 17.24 కోట్లు వచ్చాయి. అంటే మరో 1.76 కోట్లు వస్తే క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

Recommended Video

Pooja Hegde, Akhil Akkineni Interview | Most Eligible Bachelor
టాలీవుడ్‌లో నాలుగో స్థానంలో అఖిల్

టాలీవుడ్‌లో నాలుగో స్థానంలో అఖిల్

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీకి మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.03 కోట్లు వచ్చాయి. దీంతో మూడో రోజు ఎక్కువ వసూలు చేసిన టైర్ 2 హీరోల జాబితాలో అఖిల్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ లిస్టులో నాగ చైతన్య 'లవ్ స్టోరీ' రూ. 5.19 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. రామ్.. ఇస్మార్ట్ శంకర్, నితిన్ భీష్మ మూవీలు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X