twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Most Eligible Bachelor day 4 Collections: దుమ్మురేపిన అఖిల్.. నాలుగో రోజు కలెక్షన్ల రచ్చ.. బ్రేక్ ఈవెన్ కూడా!

    |

    అక్కినేని నటవారసుడుగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఇప్పటి దాకా అనేక ప్రయత్నాలు చేశారు.. దాదాపు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఒక్క సినిమా కూడా ఆయనకు కలిసి రాలేదు.. ఇక గీతా ఆర్ట్స్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆయనకు కలిసి రావడంతో ఆ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాలతో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి? నాలుగు రోజుల కలెక్షన్లు ఏ మేరకు సాధించింది అనే వివరాల్లోకి వెళితే

    కసితో

    కసితో

    ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో అక్కినేని అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ కలిసి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమా చేశారు. దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా దసరా సంధర్భంగా అక్టోబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    మంచి ప్రీ రిలీజ్

    మంచి ప్రీ రిలీజ్

    ఇక అఖిల్ గత సినిమాలను పట్టించుకోకుండా కేవలం గీతా ఆర్ట్స్ క్రెడిబిలిటీతో ఈ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఈ సినిమాకు 17.50 కోట్ల వ్యాపారం జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగానే మార్కెట్ అయింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కలిపి ఈ సినిమా మొత్తం మీద 18.50 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా మొదటి ఆట నుంచి మంచి స్పందన రావడంతో ఆటీమ్ అంతా మంచి ఊపులో ఉంది.

    నాలుగో రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

    నాలుగో రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

    అఖిల్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల లాగే నాలుగో రోజూ మంచి స్పందనే లభించింది. ఫలితంగా నైజాంలో రూ.68 లక్షలు, సీడెడ్‌లో రూ.41 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 24 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 7 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.59 కోట్లు షేర్, రూ. 2.5 కోట్లు గ్రాస్ వచ్చింది.

     నాలుగు రోజులకు కలిపి

    నాలుగు రోజులకు కలిపి

    ఇక నాలుగు రోజులకు కలిపి గనుక చూస్తే నైజాంలో రూ.6.09 కోట్లు, సీడెడ్‌లో రూ.4.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.91 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 95 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 77 లక్షలు, గుంటూరులో రూ. 1.11 కోట్లు, కృష్ణాలో రూ. 87 లక్షలు, నెల్లూరులో రూ.66 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 15.62 కోట్లు షేర్, రూ. 26.2 కోట్లు గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రూ. 15.62 కోట్లు కొల్లగొట్టిన 'బ్యాచ్‌లర్' ప్రపంచ వ్యాప్తంగా కూడా సత్తా చాటడంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.17 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.2.16 కోట్లు, వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే నాలుగు రోజుల్లో సినిమాకు రూ. 18.94 కోట్లు షేర్‌తో పాటు రూ. 41.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

    బ్రేక్ ఈవెన్ కు అతి దగ్గరలో

    బ్రేక్ ఈవెన్ కు అతి దగ్గరలో

    చాలా అంచనాలతో వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజుల్లో దీనికి రూ. 18.94 కోట్లు వచ్చాయి. అంటే దాదాపుగా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నట్టే, మరో ఆరు లక్షలు సాధిస్తే అది నమోదవుతుంది. ఈ ఊపులో ఆరు లక్షలు అంటే చాలా చిన్న విషయం అంటే చెప్పాలి.

    English summary
    Tollywood Young Hero Akhil Akkineni's Most Eligible Bachelor with Bommarillu Bhaskar collected Rs 18.94 Crores in 4 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X