Most Eligible Bachelor Collections: సగానికి సగం పడిపోయిన కలెక్షన్స్.. అయినా అన్ని కోట్ల లాభం
కోవిడ్ సెకెండ్ వేవ్ తర్వాత చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే, అందులో అతి తక్కువ చిత్రాలకు మాత్రమే మంచి కలెక్షన్లు వస్తున్నాయి. టాక్ మంచిగా ఉన్న మూవీలు కూడా ప్రతికూల పరిస్థితుల కారణంగా పరాజయాలను చవి చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అస్సలు ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయిన అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రంతో అతడు మొదటి విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆరు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం పదండి!

‘బ్యాచ్‌లర్' మారి వచ్చేసిన అఖిల్
అక్కినేని అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో వచ్చిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

అఖిల్ స్టామినాకు మించిన బిజినెస్
అఖిల్‌కు ఇప్పటి వరకూ ఒక్క హిట్ కూడా లేదు. అయినప్పటికీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.60 కోట్ల వ్యాపారం జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగానే ప్రభావం చూపింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కలిపి దీనికి రూ. కోటి బిజినెస్ జరిగిందట. వీటితో మొత్తంగా దీనికి రూ. 18.60 కోట్ల బిజినెస్ జరిగింది.

భారీ అంచనాలు.. సత్తా చాటుతోంది
హిట్ కోసం వేచి చూస్తోన్న అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ అవుతోంది.

ఆరో రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే
అఖిల్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు నిరాశే ఎదురైందని చెప్పాలి. ఫలితంగా నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3.20 లక్షలు, నెల్లూరులో రూ. 2.60 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 57 లక్షలు షేర్, రూ. 85 లక్షలు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఆరు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.49 కోట్లు కొల్లగొట్టింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.24 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.22 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఆరు రోజుల్లో దీనికి రూ. 20.95 కోట్లు షేర్‌తో పాటు రూ. 34.90 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి దుమ్ముదులిపింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వచ్చిందిలా
క్రేజీ కాంబోలో వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, ఆరు రోజుల్లో దీనికి రూ. 20.95 కోట్లు వచ్చాయి. దీంతో దీనికి హిట్ స్టేటస్ అందుకోవడంతో పాటు రూ. 1.95 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.
Recommended Video

అక్కడ అరుదైన ఘనతను అందుకుంది
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్ చిత్రంగా నిలిచింది. అదే సమయంలో ఐదు రోజుల్లోనే ఇది అమెరికాలో 5 లక్షల అమెరికన్ డాలర్లను వసూలు చేసింది. దీంతో 'జాతి రత్నాలు', 'లవ్ స్టోరీ' తర్వాత ఎక్కువ కలెక్షన్లను అందుకుంది. మరి అక్కడ మిలియన్ మార్కును చేరుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











