Most Eligible Bachelor Collections: వారంలోనే అన్ని కోట్లు.. బాక్సాఫీస్‌ను ర్యాంప్ ఆడించిన అఖిల్

గతంలో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ రేంజ్ హిట్లు చాలా తక్కువగా వస్తున్నాయి. కోవిడ్ తర్వాత పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో పాటు టికెట్ రేట్ల ఇష్యూ ఉండడం వల్ల మంచి టాక్ ఉన్న సినిమాలు కూడా కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. దీంతో బాక్సాఫీస్‌కు సరైన బ్రేక్ కావాలని సినీ ప్రియులంతా కోరుకున్నారు.

ఇలాంటి సమయంలో అసలు ఇప్పటి వరకూ ఒక్క హిట్ కూడా లేని అక్కినేని అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రంతో అతడు మొదటి హిట్‌ను సొంతం చేసుకోవడంతో పాటు టాలీవుడ్‌లో జోష్‌ను నింపాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం పదండి!

 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా అఖిల్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా అఖిల్

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన చిత్రమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా భారీ స్థాయిలో విడుదల చేసేశారు.

హిట్ లేకున్నా బిజినెస్ ఓ రేంజ్‌లో

హిట్ లేకున్నా బిజినెస్ ఓ రేంజ్‌లో

ఇప్పటి వరకూ అఖిల్‌కు ఒక్క హిట్ కూడా లేదు. అయినప్పటికీ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.70 కోట్ల వ్యాపారం జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా కూడా బాగానే ప్రభావం చూపింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కలిపి దీనికి రూ. కోటి బిజినెస్ జరిగిందట. వీటితో మొత్తంగా దీనికి రూ. 18.70 కోట్ల బిజినెస్ చేసుకుంది.

అంచనాలకు తగ్గట్లే.. ఫుల్ రెస్పాన్స్

అంచనాలకు తగ్గట్లే.. ఫుల్ రెస్పాన్స్

అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీంతో కలెక్షన్లు కూడా భారీగా రావడంతో ఇది సూపర్ హిట్ అయింది.

ఏడో రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

ఏడో రోజు ఎక్కడ ఎంత వచ్చిందంటే

అఖిల్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు కలెక్షన్లు బాగా తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1.60 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 36 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్ వచ్చింది.

 ఏడు రోజులకు ఎక్కడ.. ఎంతొచ్చింది

ఏడు రోజులకు ఎక్కడ.. ఎంతొచ్చింది

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీకి వారం రోజుల్లో నైజాంలో రూ. 7 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.71 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.16 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.10 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 89 లక్షలు, గుంటూరులో రూ. 1.26 కోట్లు, కృష్ణాలో రూ. 98 లక్షలు, నెల్లూరులో రూ. 75 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.85 కోట్లు షేర్‌తో పాటు రూ. 29.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లెంత

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఏడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.85 కోట్లు కొల్లగొట్టింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.25 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఫస్ట్ వీక్‌లో దీనికి రూ. 21.45 కోట్లు షేర్‌తో పాటు రూ. 35.70 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి రికార్డులు కొట్టేసింది.

Recommended Video

Date With Akhil Tour | Akhil Interaction With Crazy Girls
బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వచ్చిందిలా

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వచ్చిందిలా

ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.70 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 21.45 కోట్లు వచ్చాయి. దీంతో దీనికి హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.45 కోట్లు లాభాలు కూడా వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X