Agent 2 Days Collections: 2వ రోజే బిగ్ షాక్.. అఖిల్‌కు భారీ దెబ్బ.. ఇంకెన్ని కోట్లు రావాలో తెలిస్తే!
అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చినా.. ఆరంభంలోనే ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోతోన్నాడు హ్యాండ్సమ్ గాయ్ అఖిల్. వరుసగా మూడు పరాజయాల తర్వాత ఏకైక విజయాన్ని సొంతం చేసుకున్న అతడు.. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'ఏజెంట్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లు పెద్దగా రావడం లేదు. ఇక, రెండో రోజు బాగా డౌన్ అయ్యాయి. మరి 'ఏజెంట్' 2 రోజుల రిపోర్టను మీరే చూసేయండి!
ఏజెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్: అక్కినేని అఖిల్ హీరోగా.. సురేందర్ రెడ్డి తీసిన చిత్రమే 'ఏజెంట్'. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా, మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రను చేశారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించగా.. హిప్‌హాప్ తమీజా సంగీతాన్ని సమకూర్చాడు.

ఏజెంట్ మూవీ బిజినెస్ డీటేల్స్ : అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' మూవీకి నైజాంలో రూ. 10.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 29.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.10 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.20 కోట్ల బిజినెస్ అయింది.
2వ రోజు తెలుగు వసూళ్లు ఇలా : అఖిల్ 'ఏజెంట్' మూవీకి 2వ రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ షాక్ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 21 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 7 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 67 లక్షలు షేర్, రూ. 1.30 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.
2 రోజులకూ ఎంత వచ్చింది? : 'ఏజెంట్' మూవీకి 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఘోరమైన వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.54 కోట్లు, సీడెడ్‌లో రూ. 72 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 65 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 35 లక్షలు, గుంటూరులో రూ. 59 లక్షలు, కృష్ణాలో రూ. 27 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో కలిపి.. రూ. 4.67 కోట్లు షేర్, రూ. 7.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఏపీ, తెలంగాణలో 2 రోజుల్లో దారుణంగా రూ. 4.67 కోట్లు మాత్రమే వసూలు చేసిన 'ఏజెంట్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంటోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 34 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 75 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లోనే రూ. 5.76 కోట్లు షేర్, రూ. 10.25 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.
మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?: స్పై థ్రిల్లర్‌గా వచ్చిన 'ఏజెంట్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 37 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 5.76 కోట్లు వచ్చాయి. అంటే.. మరో రూ. 31.24 కోట్లు రాబడితేనే అఖిల్ ఏజెంట్ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

అప్పుడే ఇంత తక్కువగానా?:అక్కినేని అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన 'ఏజెంట్' మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతోంది. అందుకే దీనికి ఓపెనింగ్స్ చాలా తక్కువగా వచ్చాయి. ఇక, రెండో రోజైతే కోటి రూపాయలను కూడా ఇది వసూలు చేయలేకపోయింది. దీంతో ఈ చిత్రం భారీ నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా.


Click it and Unblock the Notifications











