Agent 4 Days Collections: అఖిల్‌కు భారీ దెబ్బ.. 4 రోజుల్లో ఇంత తక్కువగా.. అన్ని కోట్ల నష్టాల దిశగా!
టాలీవుడ్‌లోకి ఎంతో మంది స్టార్ల వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే విజయాలను సొంతం చేసుకోగా.. మరికొందరు మాత్రం చాలా కాలం పాటు ఇబ్బంది పడ్డారు. అందులో అక్కినేని అఖిల్ ఒకడు.
మూడు ఫ్లాపుల తర్వాతనే హిట్ ట్రాక్ ఎక్కిన అతడు.. ఇప్పుడు 'ఏజెంట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్లు అంతగా రావడం లేదు. ఈ నేపథ్యంలో అఖిల్ 'ఏజెంట్' మూవీ 4 రోజుల్లో ఎంత వసూలు చేసిందో లుక్కేయండి!

ఏజెంట్‌గా మారిపోయిన అఖిల్: అఖిల్- సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే 'ఏజెంట్'. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా, మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ ఇవ్వగా.. హిప్‌హాప్ తమీజా మ్యూజిక్‌ను ఇచ్చాడు.

ఏజెంట్ మూవీ బిజినెస్ డీటేల్స్: అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్' మూవీకి నైజాంలో రూ. 10.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 29.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.10 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.20 కోట్ల బిజినెస్ జరిగింది.

4వ రోజు తెలుగు వసూళ్లు ఇలా: అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ పెద్దగా దక్కలేదు. దీనికితోడు ఆ తర్వాత కూడా ఇది పెద్దగా స్పందనను అందుకోవడం లేదు. ఫలితంగా కలెక్షన్లు డౌన్ అవుతూనే ఉన్నాయి. ఇలా మూడో రోజు రూ. 43 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇక, నాలుగో రోజు దీనికి రూ. 17 లక్షలు మాత్రమే వచ్చాయి.

4 రోజులకూ ఎంత వచ్చింది?: 'ఏజెంట్' మూవీకి 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.54 కోట్లు, సీడెడ్‌లో రూ. 81 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 78 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 44 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 66 లక్షలు, కృష్ణాలో రూ. 33 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో కలిపి.. రూ. 5.27 కోట్లు షేర్, రూ. 9.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఏపీ, తెలంగాణలో 4 రోజుల్లో దారుణంగా రూ. 5.27 కోట్లు మాత్రమే వసూలు చేసిన 'ఏజెంట్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంటోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 37 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 80 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా4 రోజుల్లోనే రూ. 6.44 కోట్లు షేర్, రూ. 12.05 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.
మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?: క్రేజీ కాంబోలో వచ్చిన 'ఏజెంట్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 37 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 6.44 కోట్లు వచ్చాయి. అంటే.. మరో రూ. 30.56 కోట్లు రాబడితేనే అఖిల్ ఏజెంట్ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

అన్ని కోట్లు నష్టాలు వచ్చేలా: అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి రూపొందించిన 'ఏజెంట్' మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతోంది. అందుకే దీనికి ఓపెనింగ్స్ చాలా తక్కువగా వచ్చాయి. రెండో రోజు నుంచి బాగా పడిపోయాయి. ఇక, నాలుగో రోజు కేవలం రూ. 17 లక్షలే వచ్చాయి. ఇదే కంటిన్యూ అయితే ఈ చిత్రానికి రూ. 30 కోట్లు వరకూ నష్టం వచ్చే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications











