Agent 5 Days Collections: అఖిల్‌కు మైండ్ బ్లాక్ దెబ్బ.. 5వ రోజు మరీ ఘోరం.. ఇలా ఎవరికీ జరగలేదు పాపం!

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ హీరో అక్కినేని అఖిల్. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న అతడు.. గత ఏడాది కెరీర్‌లో మొదటి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'ఏజెంట్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో కలెక్షన్లు పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో అఖిల్ 'ఏజెంట్' మూవీ 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో లుక్కేయండి!

స్పై ఏజెంట్‌గా వచ్చేసిన అఖిల్ : అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి రూపొందించిన సినిమానే 'ఏజెంట్'. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా, మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ ఇవ్వగా.. హిప్‌హాప్ తమీజా మ్యూజిక్‌ ఇచ్చాడు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు.

Agent 5 Days Collections

ఏజెంట్ మూవీ బిజినెస్ డీటేల్స్ : అఖిల్ - సాక్షి జంటగా నటించిన 'ఏజెంట్' మూవీకి నైజాంలో రూ. 10.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 29.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.10 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.20 కోట్ల బిజినెస్ అయింది.

Agent 5 Days Collections

5వ రోజు తెలుగు వసూళ్లు ఇలా : స్పై థ్రిల్లర్ జోనర్‌లో అఖిల్ నటించిన 'ఏజెంట్' మూవీకి ఆరంభంలోనే బ్యాడ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మంచిగా రాలేదు. దీనికితోడు ఆ తర్వాత కూడా ఇది పెద్దగా రాణించడట్లేదు. ఫలితంగా కలెక్షన్లు దారుణంగా వస్తున్నాయి. ఇలా నాలుగో రోజు రూ. 17 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇక, ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ. 5 లక్షలు మాత్రమే వచ్చాయి.

Agent

5 రోజులకూ ఎంత వచ్చింది? : 5 రోజుల్లో 'ఏజెంట్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.64 కోట్లు, సీడెడ్‌లో రూ. 82 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 80 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 45 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 66 లక్షలు, కృష్ణాలో రూ. 34 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో కలిపి.. రూ. 5.32 కోట్లు షేర్, రూ. 9.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది : ఏపీ, తెలంగాణలో 5 రోజుల్లో దారుణంగా రూ. 5.32 కోట్లు మాత్రమే వసూలు చేసిన 'ఏజెంట్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంటోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 38 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 82 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో రూ. 6.52 కోట్లు షేర్‌, రూ. 12.30 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి? : క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'ఏజెంట్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 37 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 6.52 కోట్లు వచ్చాయి. అంటే.. మరో రూ. 30.48 కోట్లు రాబడితేనే అఖిల్ ఏజెంట్ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Agent

ఇక కష్టమే.. భారీ డిజాస్టర్‌గా: హ్యాండ్సమ్ హీరో అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన 'ఏజెంట్' మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతోంది. దీనికితోడు కలెక్షన్లు క్రమంగా డౌన్ అవుతూనే ఉన్నాయి. ఐదో రోజు అయితే కేవలం రూ. 5 లక్షలే వచ్చాయి. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో మీడియం రేంజ్ హీరోల్లో ఎవరికీ ఇంత తక్కువ వసూళ్లు రాకపోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X