Agent 6 Days Collections: అఖిల్‌కు దిమ్మతిరిగే షాక్.. 6 రోజే ఇంత ఘోరమా.. ఏకంగా అన్ని కోట్ల నష్టాలు!
అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి వచ్చి.. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ.. తన రేంజ్‌ను క్రమంగా పెంచుకుంటూ ముందుకు వెళ్తోన్న మీరో అఖిల్. ఫలితాలను పక్కన పెడితే.. విభిన్నమైన చిత్రాలతో పాటు విలక్షణమైన నటనను కనబరుస్తూ వస్తోన్న అతడు.. గత వారంలోనే 'ఏజెంట్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో కలెక్షన్లు క్రమంగా పడిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అఖిల్ నటించిన 'ఏజెంట్' మూవీ 6 రోజుల్లో ఓవరాల్‌గా ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!
స్పై థ్రిల్లర్ స్టోరీతో వచ్చేశాడు:అక్కినేని అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమే 'ఏజెంట్'. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా, మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ ఇవ్వగా.. హిప్‌హాప్ తమీజా మ్యూజిక్ ఇచ్చాడు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు.

ఏజెంట్ మూవీ బిజినెస్ డీటేల్స్:అఖిల్ - సాక్షి కలిసి నటించిన 'ఏజెంట్' మూవీకి నైజాంలో రూ. 10.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 29.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.10 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.20 కోట్ల బిజినెస్ జరిగింది.

6వ రోజు తెలుగు వసూళ్లు ఇలా:స్పై థ్రిల్లర్ స్టోరీతో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన 'ఏజెంట్' మూవీకి ఆరంభంలోనే అంతటా నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ తక్కువగా వచ్చాయి. రెండో రోజు నుంచే ఈ మూవీకి రెస్పాన్స్ తగ్గిపోయింది. ఫలితంగా కలెక్షన్లు డౌన్ అవుతోన్నాయి. ఇలా 5వ రోజు రూ. 5 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇక, 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ. 4 లక్షలే కలెక్ట్ అయ్యాయి.
6 రోజులకూ ఎంత వచ్చింది?:'ఏజెంట్' మూవీకి 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 83 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 81 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 45 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 66 లక్షలు, కృష్ణాలో రూ. 34 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో కలిపి.. రూ. 5.36 కోట్లు షేర్, రూ. 9.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:6 రోజుల్లో ఏపీ, తెలంగాణలో దారుణంగా రూ. 5.36 కోట్లు మాత్రమే వసూలు చేసిన 'ఏజెంట్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంటోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 38 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 83 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో రూ. 6.57 కోట్లు షేర్, రూ. 12.40 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?:క్రేజీ కాంబోలో వచ్చిన 'ఏజెంట్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 37 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 6.57 కోట్లు వచ్చాయి. అంటే.. మరో రూ. 30.43 కోట్లు రాబడితేనే అఖిల్ ఏజెంట్ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











