Agent Closing Collections: 80 కోట్ల సినిమా.. వారానికే ఢమాల్.. కోట్ల నష్టాలతో అఖిల్ చెత్త రికార్డు
తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి చాలా మంది హీరోలుగా పరిచయం అవడమే. అందులో నాగార్జున కుమారుడిగా వచ్చిన అఖిల్ గురించి స్పెషల్‌గా చెప్పుకోవాలి. ఆరంభంలోనే మూడు పరాజయాలను చవి చూసిన అతడు.. గత ఏడాది ఒక హిట్ కొట్టాడు. ఈ జోష్‌లోనే ఇటీవలే 'ఏజెంట్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ సినిమాకు ఆశించిన రీతిలో స్పందన రాలేదు. ఫలితంగా దీనికి కోట్ల నష్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్ల రిపోర్ట్ మీరే చూడండి!
స్పైగా ఎంట్రీ ఇచ్చేసిన అఖిల్:అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి రూపొందించిన మూవీనే 'ఏజెంట్'. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించగా, మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ దీనికి కథ ఇవ్వగా.. హిప్‌హాప్ తమీజా సంగీతం ఇచ్చాడు.

ఏజెంట్ మూవీ బిజినెస్ డీటేల్స్:అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్' మూవీకి నైజాంలో రూ. 10.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 14.80 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 29.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.10 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.20 కోట్ల బిజినెస్ జరిగింది.
నెగెటివ్ టాక్.. డల్‌గా కలెక్షన్లు:స్పై థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందిన 'హిట్: ది సెకెండ్ కేస్' మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విశేషమైన స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు దారుణంగా వచ్చాయి. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే చాలా చోట్ల రన్‌ను ముగించేసింది. అదే ప్రపంచ వ్యాప్తంగానూ కనిపించింది. దీంతో అఖిల్‌కు మరో షాక్ తగిలినట్లైంది.

తెలుగులో ఎంత వచ్చింది?:'ఏజెంట్' మూవీకి ఫుల్ రన్‌లో తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.68 కోట్లు, సీడెడ్‌లో రూ. 84 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 82 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 45 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 66 లక్షలు, కృష్ణాలో రూ. 34 లక్షలు, నెల్లూరులో రూ. 22 లక్షలతో కలిపి.. రూ. 5.40 కోట్లు షేర్, రూ. 9.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:ఫుల్ రన్‌లో ఏపీ, తెలంగాణలో దారుణంగా రూ. 5.40 కోట్లు మాత్రమే వసూలు చేసిన 'ఏజెంట్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంటోంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 38 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 84 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.62 కోట్లు షేర్, రూ. 12.50 కోట్లు గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. నష్టం ఎంత?:స్టైలిష్ కాంబోలో వచ్చిన 'ఏజెంట్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 37 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి రూ. 6.62 కోట్లు వచ్చాయి. అంటే.. ఈ సినిమా వారంలోనే రన్ ముగించుకోవడంతో పాటు రూ. 30.38 కోట్లు నష్టాలను చవి చూసింది.

కోట్ల నష్టాలతో చెత్త రికార్డులు:అక్కినేని అఖిల్ ఇప్పటి వరకూ హీరోగా ఐదు సినిమాలు చేశాడు. అందులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మినహా అన్ని ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా అతడి ఫస్ట్ మూవీ 'అఖిల్'కు రూ. 30 కోట్లు పైగా నష్టాలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు 'ఏజెంట్'కు కూడా రూ. 30 కోట్లు నష్టాలు దక్కాయి. ఇలా రెండు భారీ డిజాస్టర్లను చవి చూసిన హీరోగా అఖిల్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











