AGENT: అన్ని వందల థియేటర్లలో ఏజెంట్.. అక్కినేని అఖిల్ సంచలన రికార్డు
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ.. ప్రేక్షకులను, అభిమానులు అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు అక్కినేని అఖిల్. అతడి కెరీర్ ఆశించిన రీతిలో ప్రారంభం కాకపోయినా.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి హిట్ తర్వాత మరింత ఉత్సాహంతో దూసుకుపోతోన్నాడు.
ఈ జోష్‌తోనే ఇప్పుడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి 'ఏజెంట్' అనే సినిమాను చేశాడు. క్రేజీ కాంబినేషన్‌లో కావడంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయని చెప్పొచ్చు.

అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' మూవీపై ఆరంభం నుంచే ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు సైతం క్రియేట్ అయిపోయాయి.
అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 29.30 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 36.20 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
'ఏజెంట్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని నైజాంలో 245, సీడెడ్‌లో 175, ఆంధ్రాలో 330 వరకూ అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 750 నుంచి 760 థియేటర్లలో విడుదల అవుతోంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 120, ఓవర్సీస్‌లో 250 థియేటర్లలో రాబోతుంది.

అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 1120 నుంచి 1130 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అని తెలుస్తోంది. దీంతో అతడి ఖాతాలో మరో అరుదైన ఘనత వచ్చి చేరిపోయింది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న 'ఏజెంట్' మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించగా.. హిప్‌హాప్ తమీజా సంగీతాన్ని సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











