Most Eligible Bachelor 10 days Collections: అఖిల్ అస్సలు తగ్గట్లేదుగా.. ఇప్పటివరకు ప్రాఫిట్స్ ఎంతంటే?

ఈ రోజుల్లో బాక్సాఫీసు వద్ద సక్సెస్ అందుకోవడం అంటే చాలా కష్టమైన పని చెప్పవచ్చు. ఓవైపు కరోనా మరోవైపు సినిమా టికెట్ల రేట్లు నిర్మాతలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఇక వచ్చిన సినిమాకు ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ కష్ట సమయంలో సక్సెస్ కొట్టిన హీరో భవిష్యత్తులో కూడా చాలా ఈజీగా సక్సెస్ అందుకుంటాడు అని చెప్పవచ్చు.

మొత్తానికి అఖిల్ అక్కినేని కూడా కండిషన్స్ చాలా క్రిటికల్ గా ఉన్న సమయంలోనే బాక్సాఫీస్ హిట్ అందుకోవడం విశేషం. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా మంచి వసూళ్లను అందుకుంది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా ఎంతవరకు ప్రాఫిట్స్ లోకి వచ్చింది అని వివరాల్లోకి వెళితే..

 టార్గెట్ ఎంతంటే..

టార్గెట్ ఎంతంటే..

సాధారణంగా హీరోయిన్స్ అంతకుముందు సినిమాలతో డిజాస్టర్స్ ఎదుర్కొంటే తదుపరి సినిమాలపై తప్పకుండా ఎంతోకొంత ప్రభావం చూపిస్తుంది. కానీ అక్కినేని అఖిల్ మాత్రం వరుసగా మూడు అపజయాలు చూసినప్పటికీ నాలుగో సినిమాపై ప్రభావం పడకుండా చూసుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా 18.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో విడుదలవడం విశేషం.

10వ రోజు ఏరియాల వారిగా వచ్చిన షేర్

10వ రోజు ఏరియాల వారిగా వచ్చిన షేర్

9వ రోజు 9 లక్షల షేర్ అందుకున్న ఈ సినిమా 10వ రోజు మాత్రం ఆదివారం కావడంతో కొన్ని నెంబర్లను పెంచుకుంది. 10వ రోజు ఏరియాల వారిగా వచ్చిన షేర్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 16 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4.7 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 0.51 లక్షలు షేర్ రాగా.. గ్రాస్ 0.85కోట్లు దక్కింది.

10 రోజుల్లో వచ్చిన మొత్తం షేర్..

10 రోజుల్లో వచ్చిన మొత్తం షేర్..

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'కు 10 రోజుల్లో నైజాంలో రూ. 7.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.90 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.28 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.18 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 95 లక్షలు, గుంటూరులో రూ. 1.34 కోట్లు, కృష్ణాలో రూ. 1.07 కోట్లు, నెల్లూరులో రూ. 80 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 18.87 కోట్లు షేర్‌తో మొత్తంగా రూ. 31.95 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఇక వరల్డ్ వైడ్ గా 10 రోజుల్లో..

ఇక వరల్డ్ వైడ్ గా 10 రోజుల్లో..

తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.87 కోట్లు అందుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.34 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 9 రోజుల్లో దీనికి రూ. 22.66 కోట్లు షేర్‌తో పాటు రూ. 38 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి సరికొత్త రికార్డులు కొట్టేసింది.

Recommended Video

Bigg Boss లో ఇలా ఆడితే ఫ్యాన్స్ ఒప్పుకోరు.. Mind It | SRC ఫ్యాన్స్ స్ట్రాటజీ || Filmibeat Telugu
ప్రాఫిట్స్ ఎంతంటే..

ప్రాఫిట్స్ ఎంతంటే..

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీపై అఖిల్ గత సినిమాల ప్రభావం పెద్దగా చూపలేదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.5 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 19 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 22.66 కోట్లు వచ్చాయి. ఇక సినిమా ప్రస్తుతం 3.66కోట్లతో ప్రాఫిట్స్ లో కొనసాగుతోంది. గత మూడు రోజులతో పోలిస్తే ఆదివారం కలెక్షన్స్ అయితే బాగానే వచ్చాయి. మరి రానున్న రోజుల్లో ఇంకా ఎంతవరకు వస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X