Thandel Box Office : ఫస్ట్ డే 21 కోట్లు.. రెండో రోజూ అదే విధ్వంసం, నాగచైతన్య మూవీకి ఎన్ని కోట్లంటే?
గత మూడేళ్లుగా ఫ్లాప్స్‌తో సతమతం అవుతోన్న యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో క్రేజీ డైరెక్టర్ చందూ మొండేటీతో కలిసి చేసిన చిత్రమే తండేల్. లవ్, యాక్షన్, దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు రికార్డు ఓపెనింగ్స్‌తో దుమ్ముదులిపిన నాగచైతన్య .. బాక్సాఫీస్ వద్ద రెండో రోజు ఎన్ని కోట్లు రాబట్టాడో చూస్తే:
తండేల్‌లో నాగచైతన్య సరసన లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి జంటగా నటించింది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తండేల్ సినిమా ఉత్తరాంధ్రలోని జాలర్ల జీవితంలో జరిగిన యదార్థ గాధ ఆధారంగా తెరకెక్కించారు. సముద్రం, పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌తో కథ కొనసాగుతుంది. దాంతో తండేల్‌కు సెట్స్, రీసెర్చ్ వర్క్ చాలా అవసరమైంది. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నిషియన్స్ పనిచేయడంతో ఖర్చు కూడా భారీగా జరిగింది. తండేల్‌ను ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి సుమారుగా రూ. 75 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించారు.

టీజర్, ట్రైలర్లు, నాగచైతన్య లుక్‌తో తండేల్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఏపీ, నైజాంలో గీతా ఆర్ట్స్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 11 కోట్లకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో 27 కోట్ల మేర రైట్స్ బిజినెస్ వాల్యూ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 28 కోట్ల షేర్.. సుమారుగా 60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.
ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌కు సుమారుగా 3 కోట్లు .. హిందీ రైట్స్ 10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 12 కోట్ల మేర అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 52 కోట్ల మేర జరిగడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్లుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఇలా ఊహించని విధంగా రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను సుమారుగా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.
మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో తండేల్‌కు తొలిరోజు బుకింగ్స్ ఓ రేంజ్‌లో జరగడంతో నాగచైతన్య మూవీకి రికార్డు స్థాయిలో రూ.21.27 కోట్ల ఓపెనింగ్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఆయన కెరీర్‌లోనే రికార్డు ఓపెనింగ్స్ కావడం విశేషం. అటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా దుమ్ముదులిపింది. దాదాపు 4 లక్షల డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.3.25 కోట్లు) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ అధికారంగా ప్రకటించారు.
ఇక రెండో రోజు వసూళ్ల విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం, అజిత్ నటించిన పట్టుదల వంటి చిత్రాలు బరిలో ఉన్నప్పటికీ తండేల్‌కు యూత్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. శనివారం బుకింగ్స్ పరంగా మంచి హోల్డ్ సాధించిన ఈ సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.2 కోట్లు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలలో రూ. 4 కోట్ల చొప్పున మొత్తంగా రూ.14 కోట్ల వసూళ్లను రాబట్టింది. నాగచైతన్య ఊపు చూస్తుంటే ఆదివారం మార్నింగ్ షో నాటికే రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











