NC24: నాగచైతన్య మూవీకి రికార్డ్ బిజినెస్.. షూటింగ్ కాకుండానే భారీ డీల్, ఎన్ని కోట్లంటే?
శోభిత ధూళిపాళతో రెండో పెళ్లి తర్వాత అక్కినేని వారసుడు నాగచైతన్య జోరు మీదున్నారు. శోభిత తన జీవితంలోకి వచ్చిన తర్వాత చైతూ నటించిన తండేల్ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇది ఆయన కెరీర్‌లోనే తొలి 100 కోట్ల చిత్రం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు అనుకోకుండా పాకిస్తాన్‌కు వెళ్లి చిక్కుకుని, తిరిగి స్వదేశానికి ఎలా వచ్చారన్న ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమా చైతూ కెరీర్‌లో అపురూపమైన చిత్రంగా నిలిచింది. చైతన్యలోని నటుడిని పరిపూర్ణంగా ఆవిష్కరించింది ఈ సినిమా. ఎమోషనల్ సీన్స్‌లో కొత్త నాగచైతన్య కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
తండేల్ తర్వాత శోభితతో హనీమూన్‌కి
తండేల్ తర్వాత భార్యతో కలిసి హనీమూన్‌కు వెళ్లిన చైతన్య తిరిగి ఇండియాకు వచ్చి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఆయన తదుపరి చిత్రం NC24పై అందరిచూపు నెలకొంది. చైతన్య ఎవరితో నటిస్తున్నారు? ఎలాంటి కథ? ఇది కూడా బయోపిక్కేనా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. తండేల్ హిట్ జోష్‌ను అలాగే కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిన చైతూ ఎలాంటి తప్పులు చేయకూడదని కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నారు.

కార్తీక్ దండు దర్శకత్వంలో ఎన్‌సీ 24
విరూపక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య తన 24వ సినిమాను చేయనున్నారు. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్‌లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం NC24 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎన్‌సీ 24 ది ఎక్స్‌కవేషన్ బిగిన్స్ అంటూ ఇటీవలే స్పెషల్ వీడియోను రిలీజ్ చేయగా అది అంచనాలను పెంచేసింది. ఈ సినిమా కోసం చైతూ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. అంతేకాదు నాగచైతన్య కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా సినిమాగా ఎన్‌సీ 24 నిలవనుంది.
నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి
ఎన్‌సీ 24లో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు వృషకర్మ అనే టైటిల్ సహా మరికొన్ని పరిశీలనలో ఉన్నాయి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగులో తెరకెక్కని మైథలాజికల్ కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారు కార్తీక్ దండు. ఈ ఏడాది చివరికి నాటికి ఎన్‌సీ 24ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.
మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఎన్‌సీ 24
తండేల్‌తో నాగచైతన్య, విరూపక్షతో కార్తీక్ దండు భారీ విజయాలను అందుకోవడం అలాంటి వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ఎన్‌సీ 24పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే భారీ బిజినెస్ జరిగినట్లుగా ఫిలింనగర్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 10 శాతం షూటింగ్ పూర్తి కాగా.. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఎన్‌సీ 24 థియేట్రికల్ రైట్స్‌కి భారీ ధర
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా రైట్స్‌ను రూ.34 కోట్లకు దక్కించుకున్నారట. ప్రస్తుతం ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. షూటింగ్ దశలోనే ఇలా ఉంటే సినిమా రిలీజ్ అయ్యాక ఓ రేంజ్‌లో కలెక్షన్స్ వస్తాయని అక్కినేని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











