తమిళ స్టార్ హీరో సినిమాతో నాగార్జున బిజినెస్.. తెలుగు హక్కులను ఎంతకు కొన్నారంటే?
తమిళ చిత్ర పరిశ్రమలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీ తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేస్తూ మంచి క్రేజ్ అయితే అందుకుంటూ ఉంటాడు. కార్తీ తమిళంలో ఎలాగైతే తన సినిమాను ప్రమోట్ చేస్తూ ఉంటాడో అలాగే తెలుగులో కూడా అంచనాలకు తగ్గట్టుగా ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు.
మొదట్లో కొన్ని వరుస విజయాలను అందుకున్న కార్తి ఆ తర్వాత మధ్యలో మరికొన్ని అపజయాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక అతని నుంచి ఆ మధ్యకాలంలో వచ్చిన ఖైదీ సినిమా అయితే తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపు ఎనిమిది కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకుని కార్తీ మార్కెట్ ను కూడా కొంత పెంచిందనే చెప్పాలి.

కాకపోతే ఆ తరువాత మరి కొన్ని సినిమాలతో కార్తీ మళ్లీ అపజయాలను ఎదుర్కోవలసి వచ్చింది. చివరగా సుల్తాన్ సినిమాతో పర్వాలేదు అనిపించిన ఈ తమిళ హీరో ఇప్పుడు సర్దార్ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాను తెలుగులో కూడా భారీగా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.
అయితే ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రిలీజ్ హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగార్జున సొంతం చేసుకోవడం విశేషం. ఒక విధంగా ఈ సినిమా డైరెక్టర్ హీరో కాంబినేషన్ కు తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసుకునేందుకు కొంతమంది బాగానే ప్రయత్నాలు చేశారు. ఇక ఫైనల్ గా నాగార్జున సినిమా థియేట్రికల్ రిలీజ్ హక్కులను దాదాపు రూ.5 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక సర్దార్ సినిమాను తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఒకేసారి ఈ ఏడాది దీపావళికి భారీస్థాయిలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో నాగార్జున ఎలాంటి లాభాలను అందుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











