రజనీకాంత్ ‘కూలి’.. నాగార్జున మాస్టర్ ప్లాన్.. కోట్ల బిజినెస్!
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఎదిగారు. ప్రస్తుతం 65 ఏళ్ల వయస్సుల్లోనూ భారీ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. మరోవైపు తన వ్యాపారాన్ని కూడా వృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా తన నటిస్తున్న సినిమా విషయంలో ఆయన అనుసరించిన బిజినెస్ ట్రిక్ కు అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ట్రేడ్ వర్గాల్లో ఇదే అంశం చర్చగా మారింది..
నాగార్జున నుంచి రాబోయే చిత్రం..
అక్కినేని నాగార్జున ఇప్పటి వరకు 90కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చిత్రాలు దాదాపు హిట్ అయ్యాయి. ఎక్కువ శాతం సినిమాలు అక్కినేని అభిమానులకు గుర్తుండిపోయేవే కావడం విశేషం. చివరిగా నాగార్జున నుంచి 'నా స్వామి రంగ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు. నెక్ట్స్ నాగార్జున నుంచి భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ధనుష్ నటిస్తున్న 'కుబేరా', సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'కూలి' చిత్రం కావడం విశేషం. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మాత్రం ఇప్పటికే పూర్తైంది. విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇందులోని 'కూలి' చిత్రం విషయంలో నాగార్జున మాస్టర్ ప్లాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

రెమ్యునరేషన్ కు బదులుగా బిజినెస్..
రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న 'కూలి' చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున సిమాన్ పాత్రలో నటించడం తో సినిమాపై తెలుగు స్టేట్స్ లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో నటించినందుకు గానూ అక్కినేని నాగార్జున రెమ్యునరేషన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదంట. బదులుగా నాగార్జున 'కూలి' సినిమా తెలుగు రైట్స్ ను కావాలని అడిగారంట. మరోవైపు నిర్మాత నాగవంశీ 40 కోట్లతో పోటీకి వచ్చినా.. ముందే నాగార్జున మాస్టర్ మైండ్ తో బిజినెస్ మాట్లాడటంతో తెలుగు థియేట్రికల్ రైట్స్ నాగార్జునకే దక్కాయని అంటున్నారు.
కూలి సినిమా బడ్జెట్, ఇతర వివరాలు..
భారీ తారాగణం నటించిన కూలి చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిథి మారన్ నిర్మించారు. రూ.400 కోట్ల బడ్జెట్ వెచ్చించి గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అక్కినేని నాగార్జున తో పాటు ఉపేంద్ర, శోభిన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. అమీర్ ఖాన్ కూడా క్యామియో అపియరెన్స్ ఇవ్వబోతున్నారు. పూజా హెగ్దే స్పెషల్ డ్యాన్స్ తో ఆకట్టుకోబోతోంది. ఫలితంగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
నాగార్జున నెక్ట్స్ ప్లానింగ్స్..
నాగార్జున ప్రస్తుతం తన కొడుకు అఖిల్ అక్కినేని కెరీయర్ ను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అఖిల్ నుంచి రాబోయే నెక్ట్స్ సినిమా 'లెనిన్'ను తానే స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే నాగార్జున తన 100వ చిత్రంపైనా ఇప్పటి నుంచే భారీ ప్లానింగ్స్ జరుగుతున్నాయి. తమిళ దర్శకుడు ఆర్ కార్తీక్ డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











