అక్కినేని కాంపౌండ్‌లో వైష్ణవ్ తేజ్.. నాగార్జునతో సినిమా.. షాకింగ్ రెమ్యునరేషన్

కంటెంట్ బావుంటే బాక్సాఫీస్ వద్ద సినిమా ఏ రేంజ్ లో వసూళ్లను అందుకుంటుందో ఉప్పెన సినిమా చూపించింది. ఈ స్థాయిలో ఒక ఎమోషనల్ లవ్ స్టొరీ రికార్డులను అందుకోవడంతో పక్క ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నో లవ్ స్టోరీలు హిట్టయ్యాయి. కానీ ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకోలేదు. ఈ ఒక్క సినిమాతోనే వైష్ణవ్ తేజ్ స్థాయి అమాంతంగా లేరిగిపోయింది. ఇక అతనిపై అక్కినేని వారి దృష్టి పడినట్లు తెలుస్తోంది.

సుకుమార్ వంద కోట్ల నమ్మకం

సుకుమార్ వంద కోట్ల నమ్మకం

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెవర్ బిఫోర్ అనేలా సాలిడ్ వసూళ్లను అందుకోగలదని చిత్ర యూనిట్ ముందు నుంచి కూడా ప్రమోషన్ గట్టిగానే చేస్తోంది. ఇక సహా నిర్మాతగా ఉన్న సుకుమార్ సినిమా రిలీజ్ కాకముందే సినిమా 100కోట్లు కలెక్ట్ చేయకపోయినా దాదాపు 90కోట్ల వరకు రావచ్చని అంచనా వేశారు. అయితే ఆయన అంచనాలకు తగ్గట్లుగా ఇంకా వసూళ్లను అయితే అందుకోలేదు.

75కోట్ల వసూళ్లు..

75కోట్ల వసూళ్లు..

సినిమా విడుదలై రెండు వారాలయ్యింది. ఇక సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 75కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక 46.66కోట్ల షేర్స్ వచ్చినట్లు సమాచారం. సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు అందుకోవడానికి కారణం మ్యూజిక్, స్టోరీ అయినప్పటికీ హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా కావడం కూడా మరో కారణం.

ఉప్పెనకు వైష్ణవ్ పారితోషికమెంతా?

ఉప్పెనకు వైష్ణవ్ పారితోషికమెంతా?

వైష్ణవ్ తేజ్ తన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అందుకే ఉప్పెన విడుదలకు ముందే క్రిష్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ చేతిలో పడ్డాడు. ఆయన దర్శకత్వంలో ఒక సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక ఉప్పెన సినిమాకు వైష్ణవ్ తేజ్ పెద్దగా రెమ్యునరేషన్ ఏమి అందుకోలేదట. మొదటి సినిమా కాబట్టి కోటి కంటే తక్కువగానే ఇచ్చినట్లు ఒక టాక్ అయితే వస్తోంది. ఇప్పుడు సినిమా 15కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది కాబట్టి మళ్ళీ షేర్ ఏమైనా ఇస్తారేమో చూడాలి.

చిన్న బడ్జెట్ లో అనుకుంటే..

చిన్న బడ్జెట్ లో అనుకుంటే..

వైష్ణవ్ తేజ్ కు రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినప్పటికీ సినిమా మేకింగ్ దగ్గర మాత్రం నిర్మాతలు బార్డర్స్ ఏమి పెట్టలేదు. హీరోతో పాటు హీరోయిన్ దర్శకుడు కూడా కొత్తవారే. వారిపై చాలా రిస్క్ తో కూడిన బడ్జెట్ పెట్టారని చెప్పవచ్చు. సినిమాను మొదట 10 కోట్ల బడ్జెట్ లోపే ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ లెక్కలు 17కోట్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సినిమా మీద నమ్మకంతో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు.

అక్కినేని నాగార్జున నిర్మాతగా..

అక్కినేని నాగార్జున నిర్మాతగా..

ఉప్పెన హిట్టు వల్ల వైష్ణవ్ తేజ్ కెరీర్ కు ఒక మంచి బూస్ట్ లభించింది. ఈ సినిమాతో అతని మార్కెట్ డిసైడ్ చేయలేము గాని అతని తదుపరి సినిమాలకు మాత్రం రెమ్యునరేషన్ గట్టిగానే తీసుకుంటాడని చెప్పవచ్చు. ఇక అక్కినేని నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

వైష్ణవ్ కు ఆ కొత్త సినిమా చేయడానికి మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వనున్నాడు అని టాక్ వస్తోంది. ఆ సినిమాను కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయనున్నాడని సమాచారం. నిజానికి వైష్ణవ్ ఇప్పుడే పెద్దగా డిమాండ్ ఏమి చేయడం లేదట. కానీ అతని డేట్స్ కోసం నిర్మాతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X