Wild Dog Day 1 Collections: టాక్ ఒకలా కలెక్షన్లు మరోలా.. నాగార్జున నుంచి అస్సలు ఊహించని ఓపెనింగ్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన 'ఊపిరి' తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. దీని తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు నిరాశే ఎదురైంది. ఇలాంటి సమయంలో ఈ సారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న పట్టుదలతో ఉన్నాడాయన. ఇందుకోసం 'వైల్డ్ డాగ్' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆ రిపోర్టు మీకోసం!

హిట్ కోసం ‘వైల్డ్ డాగ్' అవతారమెత్తిన నాగార్జున

హిట్ కోసం ‘వైల్డ్ డాగ్' అవతారమెత్తిన నాగార్జున

నూతన దర్శకుడు సోలోమన్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం 'వైల్డ్ డాగ్'. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూర్చాడు.

 అంచనాలు భారీగా.. ప్రీ బిజినెస్ ఎంత జరిగింది?

అంచనాలు భారీగా.. ప్రీ బిజినెస్ ఎంత జరిగింది?

పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా 'వైల్డ్ డాగ్'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 2.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రాలో రూ. 4 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 7.70 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 50 లక్షలతో ప్రపంచవ్యాప్తంగా రూ. 8.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

 వైభవంగా విడుదలైన మూవీ.. రెస్పాన్స్ అదుర్స్

వైభవంగా విడుదలైన మూవీ.. రెస్పాన్స్ అదుర్స్

'వైల్డ్ డాగ్' మూవీ రిపోర్టులను బట్టి ఈ సినిమా నాగార్జునకు పర్‌ఫెక్ట్ కమ్‌బ్యాక్ అంటున్నారు. మూవీ మొత్తాన్ని వన్ మ్యాన్ షోగా మలచుకున్నారని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ అదుర్స్ అనిపించిందట. అంతేకాదు, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కూడా ఆకట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో నాగార్జునకు కీలక సమయంలో హిట్ వచ్చినట్లైంది.

ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేసింది?

ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేసింది?


ఫస్ట్ డే 'వైల్డ్ డాగ్'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కలెక్షన్లు అనుకున్నలా రాలేదు. ఫలితంగా నైజాంలో రూ. 53 లక్షలు, సీడెడ్‌లో రూ. 19 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో రెండు రాష్ట్రాల్లో రూ. 1.21 కోట్లు షేర్, రూ. 2.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే


తెలుగు రాష్ట్రాల్లో 'వైల్డ్ డాగ్' చిత్రానికి ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. నాగార్జున రేంజ్‌కు ఇవి చాలా తక్కువనే చెప్పాలి. ఏపీ తెలంగాణలో రూ. 1.21 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 6 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 6 లక్షలు రాబట్టింది. ఫలితంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.33 కోట్లు షేర్‌తో పాటు రూ. 2.60 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత వస్తే సక్సెస్?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత వస్తే సక్సెస్?


అక్కినేని నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.90 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ. 1.33 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే.. ఇది క్లీన్ హిట్‌గా నిలవాలి అంటే ఇంకా రూ. 8.07 కోట్లు రాబట్టాల్సి ఉంది. వచ్చే రెండు రోజులు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X