Wild Dog Total Collections: నాగార్జునకు మరో షాక్.. 9.4 కోట్ల టార్గెట్.. చివరకు వచ్చింది ఎంతంటే!

కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం 'వైల్డ్ డాగ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం పెద్దగా రాలేదు. అలాగే, కొద్ది రోజుల పాటు నెట్టుకుంటూ వచ్చినా.. చివరకు నష్టాలతోనే బాక్సాఫీస్ రన్ ముగిసిపోయింది. నాగ్ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'వైల్డ్ డాగ్' ఫైనల్ రిపోర్టు మీకోసం!

‘వైల్డ్ డాగ్'గా మారి వచ్చిన కింగ్ నాగార్జున

‘వైల్డ్ డాగ్'గా మారి వచ్చిన కింగ్ నాగార్జున

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం 'వైల్డ్ డాగ్'. సోలోమన్ అనే నూతన దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీలో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం సమకూర్చాడు.

అంచనాలు భారీగా.. బిజినెస్ ఎంత జరిగింది?

అంచనాలు భారీగా.. బిజినెస్ ఎంత జరిగింది?

పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా 'వైల్డ్ డాగ్'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 2.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రాలో రూ. 4 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 7.70 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 50 లక్షలతో ప్రపంచవ్యాప్తంగా రూ. 8.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

పాజిటివ్ టాక్‌.. కానీ కలెక్షన్లు మాత్రం ఇలా

పాజిటివ్ టాక్‌.. కానీ కలెక్షన్లు మాత్రం ఇలా

కొత్త దర్శకులను పరిచయం చేయడంలో అక్కినేని నాగార్జున ముందుంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మందిని తెలుగు తెరకు తీసుకొచ్చిన ఈయన.. ఇప్పుడు 'వైల్డ్ డాగ్'తో సోలోమన్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమాకు మొదటి నుంచీ పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో చాలా చోట్ల టార్గెట్ కూడా దాటలేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ, ఎంత రాబట్టిందంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ, ఎంత రాబట్టిందంటే?

ముగింపు సమయానికి 'వైల్డ్ డాగ్' కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ. 1.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 43 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 44 లక్షలు, ఈస్ట్‌లో రూ. 24 వేలు, వెస్ట్‌లో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణాలో రూ. 23 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 3.08 కోట్లు షేర్‌తో పాటు రూ. 6 కోట్లు గ్రాస్‌‌ను వసూలు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా దీనికి వచ్చిన కలెక్షన్లెంత?

ప్రపంచ వ్యాప్తంగా దీనికి వచ్చిన కలెక్షన్లెంత?

తెలుగు రాష్ట్రాల్లో 'వైల్డ్ డాగ్' చిత్రానికి ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. నాగార్జున రేంజ్‌కు ఇవి చాలా తక్కువనే చెప్పాలి. ఏపీ తెలంగాణలో మొత్తంగా రూ. 3.08 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 15 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 30 లక్షలు రాబట్టింది. ఫలితంగా ముగింపు సమయానికి రూ. 3.53 కోట్లు షేర్‌, రూ. 7 కోట్లు గ్రాస్‌ను రాబట్టిందీ చిత్రం.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఫైనల్ రిపోర్టు ఇదే

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఫైనల్ రిపోర్టు ఇదే

'వైల్డ్ డాగ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.90 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.40 కోట్లుగా నమోదైంది. ముగింపు సమయానికి ఈ చిత్రం రూ. 3.53 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే.. దీనికి రూ. 5.87 కోట్లు నష్టం వచ్చింది. ఫలితంగా నాగ్ కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. కరోనా ప్రభావం చూపడంతో ఇది టాక్ బాగున్నా ఫ్లాప్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X