Wild Dog 2 Days Collections: రెండో రోజు నాగార్జునకు బిగ్ షాక్.. ఆ మూవీ కంటే తక్కువగా కలెక్షన్లు
పేరుకు సీనియర్ హీరోనే అయినా.. అందంలో, ఫిట్‌నెస్‌లో కుర్రాళ్లకు ధీటుగా కనిపిస్తారు కింగ్ అక్కినేని నాగార్జున. ఈ కారణంగానే ఆయనకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అందుకే రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనైతే సరైన హిట్ రాక ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ 'వైల్డ్ డాగ్' అనే సినిమాలో నటించారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన దీనికి పాజిటివ్ టాక్ లభించింది. కానీ, కలెక్షన్లు మాత్రం నిరాశ పరుస్తున్నాయి. ఈ చిత్రం రెండు రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

‘వైల్డ్ డాగ్'గా మారిపోయిన అక్కినేని నాగార్జున
అక్కినేని నాగార్జున హీరోగా నూతన దర్శకుడు సోలోమన్ రూపొందించిన చిత్రమే 'వైల్డ్ డాగ్'. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీలో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూర్చాడు.

అంచనాలు భారీగా.. ప్రీ బిజినెస్ ఎంత జరిగింది?
పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా 'వైల్డ్ డాగ్'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 2.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రాలో రూ. 4 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 7.70 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 50 లక్షలతో ప్రపంచవ్యాప్తంగా రూ. 8.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

రెండో రోజు ఏపీ టీఎస్‌లో ఎంత వసూలు చేసింది?
రెండో రోజు 'వైల్డ్ డాగ్' సినిమాకు కలెక్షన్లు సగానికి సగం పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 24 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్‌లో రూ. 6 లక్షలు, వెస్ట్‌లో రూ. 3.40 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5.20 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో రెండు రాష్ట్రాల్లో శనివారం రూ. 64 లక్షలు షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ రాబట్టింది.

రెండు రోజులకు కలిపి ఏపీ టీఎస్ కలెక్షన్లు ఎంత?
అక్కినేని నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీకి ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, మొదటి రోజే ఏపీ తెలంగాణలో రూ. 1.21 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక, రెండో రోజు సగానికి సగం పడిపోయి రూ. 64 లక్షలతో సరిపెట్టింది. ఫలితంగా రెండు రోజులకు కలిపి రూ. 1.85 కోట్లు కలెక్ట్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో 'వైల్డ్ డాగ్' చిత్రానికి ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. నాగార్జున రేంజ్‌కు ఇవి చాలా తక్కువనే చెప్పాలి. ఏపీ తెలంగాణలో రెండు రోజులకు రూ. 1.85 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 15 లక్షలు రాబట్టింది. ఫలితంగా రెండు రోజులకు రూ. 2.10 కోట్లు షేర్, రూ. 4.10 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత వస్తే సక్సెస్?
అక్కినేని నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.90 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజులకు ఈ చిత్రం రూ. 2.10 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే.. ఇది క్లీన్ హిట్‌గా నిలవాలి అంటే ఇంకా రూ. 7.30 కోట్లు రాబట్టాల్సి ఉంది. సుల్తాన్ కంటే దీనికి తక్కువ కలెక్షన్లు రావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











