Wild Dog 3 Days Collections: వీకెండ్‌లో ఇలాంటి కలెక్షన్లా.. అలా జరిగితేనే నాగ్ ‘వైల్డ్ డాగ్’ హిట్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్త దర్శకులతో సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో అక్కినేని నాగార్జున ఒకరు. సుదీర్ఘమైన ఆయన సినీ ప్రస్థానంలో దాదాపు నలభై మందిని ఇండస్ట్రీకి దర్శకులుగా పరిచయం చేశారు. ఈ క్రమంలోనే ఆయన కొత్త చిత్రం 'వైల్డ్ డాగ్'తో మరో డైరెక్టర్‌ను తీసుకొచ్చారు. ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ మంచి స్పందనను అందుకుంటూ దూసుకుపోతోంది. అయితే కలెక్షన్లు మాత్రం షాకింగ్‌గా ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు సోమవారం నుంచి అసలైన పరీక్ష మొదలు కాబోతుంది. వైల్డ్ డాగ్ రిపోర్టు మీకోసం!

Photos: Chiranjeevi Appreciated Wild Dog Movie Team

‘వైల్డ్ డాగ్' రూపంలో వచ్చిన అక్కినేని నాగార్జున

‘వైల్డ్ డాగ్' రూపంలో వచ్చిన అక్కినేని నాగార్జున

నూతన దర్శకుడు సోలోమన్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రం 'వైల్డ్ డాగ్'. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీలో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం సమకూర్చాడు.

వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్: పవన్ కళ్యాణ్ నా దేవుడంటూ బండ్ల గణేష్ రచ్చ (ఫొటోలు)

అంచనాలు భారీగా.. ప్రీ బిజినెస్ ఎంత జరిగింది?

అంచనాలు భారీగా.. ప్రీ బిజినెస్ ఎంత జరిగింది?

పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా 'వైల్డ్ డాగ్'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 2.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రాలో రూ. 4 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 7.70 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 50 లక్షలతో ప్రపంచవ్యాప్తంగా రూ. 8.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్ (ఫొటోలు)

మూడో రోజు ఏపీ టీఎస్‌లో ఎంత వసూలు చేసింది?

మూడో రోజు ఏపీ టీఎస్‌లో ఎంత వసూలు చేసింది?

మూడో రోజు 'వైల్డ్ డాగ్' సినిమాకు కలెక్షన్లు ఆశించినంతగా రాలేదు. ఫలితంగా నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 9 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4.40 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5.60 లక్షలు, కృష్ణాలో రూ. 5.60 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో రెండు రాష్ట్రాల్లో ఆదివారం రూ. 60 లక్షలు షేర్, రూ. 1.05 కోట్లు గ్రాస్ రాబట్టింది.

 మూడు రోజులకు కలిపి ఏపీ టీఎస్ కలెక్షన్లు ఎంత?

మూడు రోజులకు కలిపి ఏపీ టీఎస్ కలెక్షన్లు ఎంత?

'వైల్డ్ డాగ్' మూవీకి ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని అనుకున్నారు. కానీ, మొదటి రోజే ఏపీ తెలంగాణలో రూ. 1.21 కోట్లు మాత్రమే రాబట్టింది. రెండో రోజు రూ. 64 లక్షలతో సరిపెట్టింది. ఇక మూడో రోజు రూ. 60 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా మూడు రోజులకు కలిపి రూ. 2.45 కోట్లు కలెక్ట్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో 'వైల్డ్ డాగ్' చిత్రానికి ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. నాగార్జున రేంజ్‌కు ఇవి చాలా తక్కువనే చెప్పాలి. ఏపీ తెలంగాణలో మూడు రోజులకు రూ. 2.45 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 12 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 22 లక్షలు రాబట్టింది. ఫలితంగా మూడు రోజులకు రూ. 2.79 కోట్లు షేర్‌, రూ. 5.40 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత వస్తే సక్సెస్?

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత వస్తే సక్సెస్?

అక్కినేని నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.90 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజులకు ఈ చిత్రం రూ. 2.79 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే.. ఇది క్లీన్ హిట్‌గా నిలవాలి అంటే ఇంకా రూ. 6.61 కోట్లు రాబట్టాల్సి ఉంది. దీనికి సోమవారం నుంచి అసలైన పరీక్ష మొదలు కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X