twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Wild Dog 5 Days Collections: నాగ్‌కు ఊహించని పరిస్థితి.. 9.4 కోట్ల టార్గెట్.. వచ్చింది మాత్రం ఇంతే!

    |

    ఈ మధ్య కాలంలో సరైన హిట్‌ను అందుకోలేక తెగ ఇబ్బందులు పడుతున్నాడు సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున. ఇలాంటి పరిస్థితుల్లో విజయం కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ, అవేమీ ఆయనను హిట్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల 'వైల్డ్ డాగ్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం షాకింగ్‌గా ఉన్నాయి. ఇక, ఈ సినిమా ఐదు రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరు కూడా చూడండి!

    అందంతో ఆకట్టుకొంటున్న సోని చరిష్టా.. ఎద అందాలతో యువ హీరోయిన్ రచ్చ

    ‘వైల్డ్ డాగ్'గా వచ్చిన కింగ్ అక్కినేని నాగార్జున

    ‘వైల్డ్ డాగ్'గా వచ్చిన కింగ్ అక్కినేని నాగార్జున

    అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం 'వైల్డ్ డాగ్'. సోలోమన్ అనే నూతన దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీలో దియా మీర్జా, సయామీ కేర్, అతుల్ కులకర్ణి, ఆలీ రెజా, బిలాల్ హుస్సేన్, ప్రకాష్ సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం సమకూర్చాడు.

    అనన్య నాగళ్ల లవ్లీ లుక్స్.. వకీల్‌సాబ్ చిత్రంతో మరో రేంజ్‌కు మల్లేశం హీరోయిన్

    అంచనాలు భారీగా.. ప్రీ బిజినెస్ ఎంత జరిగింది?

    అంచనాలు భారీగా.. ప్రీ బిజినెస్ ఎంత జరిగింది?

    పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్‌ల కారణంగా 'వైల్డ్ డాగ్'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నైజాంలో ఈ చిత్రం రూ. 2.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రాలో రూ. 4 కోట్లతో రెండు రాష్ట్రాల్లో రూ. 7.70 కోట్ల వ్యాపారం జరిగింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో రూ. 70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 50 లక్షలతో ప్రపంచవ్యాప్తంగా రూ. 8.90 కోట్ల మేర బిజినెస్ నమోదైంది.

    యువ హీరోయిన్ కియా గ్లామరస్ ఫోటోషూట్

    ఐదో రోజు ఏపీ టీఎస్‌లో ఎంత వసూలు చేసింది?

    ఐదో రోజు ఏపీ టీఎస్‌లో ఎంత వసూలు చేసింది?

    ఐదో రోజు 'వైల్డ్ డాగ్' సినిమాకు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 1 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 80 వేలు, గుంటూరులో రూ. 1.20 లక్షలు, కృష్ణాలో రూ. 1.10 లక్షలు, నెల్లూరులో రూ. 60 వేలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం రూ. 13 లక్షలు షేర్, రూ. 22 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.

    అమృత అయ్యర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ.. చిరునవ్వుతో కట్టిపడేస్తున్న బ్యూటీ

    ఐదు రోజులకు కలిపి ఏపీ టీఎస్ కలెక్షన్లు ఎంత?

    ఐదు రోజులకు కలిపి ఏపీ టీఎస్ కలెక్షన్లు ఎంత?

    'వైల్డ్ డాగ్' మూవీకి ఆరంభం నుంచే పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు అంతగా రావడం లేదు. దీంతో మొదటి రోజే ఏపీ తెలంగాణలో రూ. 1.21 కోట్లు, రెండో రోజు రూ. 64 లక్షలు, మూడో రోజు రూ. 60 లక్షలు, నాలుగో రోజు రూ. 27 లక్షలు, ఐదో రోజు కేవలం రూ. 13 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా ఐదు రోజులకు కలిపి రూ. 2.85 కోట్లు షేర్, రూ. 5.22 కోట్లు గ్రాస్ వచ్చింది.

    హాట్ హాట్‌గా నభా నటేష్.. లేటేస్ట్ ఫోటో షూట్ వైరల్

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే

    తెలుగు రాష్ట్రాల్లో 'వైల్డ్ డాగ్' చిత్రానికి ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. నాగార్జున రేంజ్‌కు ఇవి చాలా తక్కువనే చెప్పాలి. ఏపీ తెలంగాణలో ఐదు రోజులకు రూ. 2.85 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 13 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 26 లక్షలు రాబట్టింది. ఫలితంగా ఐదు రోజులకు రూ. 3.24 కోట్లు షేర్‌, రూ. 6.26 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

    నడుము అందాలతో నాట్యం చేస్తున్న హీనా ఖాన్.. బీచ్‌లో బికినీతో అలా

    Recommended Video

    Wild Dog Movie Public Talk At Prasad's IMAX
    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత వస్తే సక్సెస్?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇంకెంత వస్తే సక్సెస్?

    'వైల్డ్ డాగ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.90 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 9.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఐదు రోజులకు ఈ చిత్రం రూ. 3.24 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే.. ఇది క్లీన్ హిట్‌గా నిలవాలి అంటే ఇంకా రూ. 6.16 కోట్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితులు బాగోపోవడం వల్లే కలెక్షన్లు ఇలా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు.

    English summary
    Akkineni Nagarjuna is an Indian film actor, producer, television presenter, and entrepreneur, who primarily works in Telugu-language films. He has also worked in some Hindi and Tamil language films. He has received nine state Nandi Awards, three Filmfare Awards South and two National Film Awards namely.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X