Selfie Collections: అక్షయ్ కుమార్ సినిమాకు భారీ దెబ్బ.. 70 కోట్లు పెడితే ఖాళీ థియేటర్లు.. సగం కూడా కష్టమే?

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ మంచి విజయాలను సొంతం చేసుకున్న హీరోలలో అక్షయ్ కుమార్ ఒకరు. ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో మినిమం కంటెంట్ ఉండే విధంగా అక్షయ్ కుమార్ అప్పట్లో చాలా జాగ్రత్తగా కథలను సెలెక్ట్ చేసుకునేవాడు. అయితే ఇటీవల కాలంలో మాత్రం అతని జడ్జిమెంట్ పూర్తిగా ఫెయిల్ అవుతొంది. రీసెంట్ గా ఏప్రిల్ 24న విడుదలైన సెల్ఫీ సినిమా దారుణాతి దారుణమైన ఓపెనింగ్స్ అందుకుంది. ఇక ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ చూస్తే అసలు పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వెనక్కి రాదేమో అనిపిస్తుంది. ఇక మొత్తంగా మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది.. అనే వివరాల్లోకి వెళితే..

మలయాళం రీమేక్

మలయాళం రీమేక్

అక్షయ్ కుమార్ ఇటీవల కాలంలో సౌత్ సినిమాలను కూడా బాగా రీమేక్ చేస్తున్నాడు. ఇక సెల్ఫీ సినిమా మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. రాజ్ మహేతా దర్శకత్వంలో ఈ సినిమాను 70 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకు ఊహించని విధంగా నెగిటివ్ టాక్ అయితే వచ్చింది.

 అక్షయ్ వరుస డిజాస్టర్స్

అక్షయ్ వరుస డిజాస్టర్స్


అసలైతే సెల్ఫీ సినిమాకు విడుదలకు ముందు ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. ఇటీవల కాలంలో అయితే అక్షయ్ కుమార్ సినిమాలకు అంతగా బాక్సాఫీస్ కలెక్షన్స్ రావడం లేదు. గతంలో అతని సినిమాలు అంటే బాక్సాఫీస్ వద్ద మినిమం కలెక్షన్స్ రెండు మూడు రోజుల్లోనే అందుకునేవి. కానీ ఇప్పుడు ఊహించని విధంగా బడ్జెట్లో సగం కూడా వెనక్కి రావడం లేదు. అక్షయ్ ఇంతకుముందు చేసిన రామ్ సేతు, కట్ పుట్లీ, రక్షా బంధన్ కూడా అంతగా క్లిక్ కాలేదు.

 మొదటి రోజే షాక్

మొదటి రోజే షాక్

సెల్ఫీ సినిమా మొదటిరోజు మాత్రమే కాకుండా శని ఆదివారాల్లో కూడా పెద్దగా కలెక్షన్స్ ఏమి అందుకోలేదు. ఈ సినిమా మొదటి రోజు ఇండియా మొత్తంలో కూడా 2.25 కోట్ల రేంజ్ లోనే కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో అక్షయ్ కుమార్ కెరీర్ లోనే అత్యంత దారుణంగా ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో సెల్ఫీ సినిమా డిజాస్టర్ రికార్డును క్రియేట్ చేసింది.

 రెండవ రోజు కూడా..

రెండవ రోజు కూడా..

ఇక రెండో రోజు ఈ సినిమాకు కాస్త అటు ఇటుగా 3 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా అయితే ప్రపంచవ్యాప్తంగా అయితే ఈ సినిమాకు 4 కోట్ల కంటే తక్కువ స్థాయిలోనే కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ స్థాయిలో సినిమా ఓపెనింగ్స్ అందుకుంటుంది అని ఎవరు కూడా ఊహించలేదు. సినిమాకు ప్రమోషన్స్ కూడా బాగానే చేసినప్పటికీ జనాలను మాత్రం థియేటర్ల వరకు చిత్ర యూనిట్ రానించలేకపోయింది.

 10 కోట్లు కూడా కష్టమే?

10 కోట్లు కూడా కష్టమే?

ఇక ఇప్పటివరకు సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మొదటి రోజుల్లో ఈ సినిమా కేవలం 6.35 కోట్ల రేంజ్ లోనే కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు అక్షయ్ కుమార్ సినిమా అంటే మినిమం కలెక్షన్స్ అయితే వచ్చేయి. కానీ ఇప్పుడు మొదటి వీకెండ్ వచ్చేసరికి ఈ సినిమాకు కనీసం 10 కోట్లయినా దాటుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. ఆదివారం రోజు కూడా చాలా థియేటర్లు ఖాళీగా కనిపించినట్లు తెలుస్తోంది.

సగం కూడా వెనక్కి వచ్చేలా లేదు?

సగం కూడా వెనక్కి వచ్చేలా లేదు?

ఈ సినిమాను కరణ్ జోహార్ తో పాటు మరికొంతమంది బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు సంయుక్తంగా నిర్మించారు. దాదాపు 70 కోట్లకు పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేశారట. మలయాళంలో సక్సెస్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ ఫార్ములా బాలీవుడ్ జనాలను మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమాకు ఆదివారం రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా ఏమీ నమోదు కాలేదు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే సినిమా బడ్జెట్లో సగానికి సగం కూడా వెనక్కి తెచ్చేలా లేదు అని అనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X