Housefull 5 Day 8 Box Office: హౌజ్ ఫుల్ 5 8వ రోజు వసూళ్లు.. అక్షయ్ కుమార్ వసూళ్ల జాతర?
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా నటించిన చిత్రం 'హౌజ్ ఫుల్ 5'. ఈ చిత్రానికి తరుణ్ మన్సఖానీ దర్శకత్వం వహించారు. జూన్ 6న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. తొలి రోజు ఈ చిత్రానికి మిక్డ్స్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వసూళ్లలో మాత్రం దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను దాటింది. ఇంకా భారీగానే వసూళ్లు కొనసాగుతున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 8వ రోజు ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందనే వివరాల్లోకి వెళితే..
హౌజ్ ఫుల్ 5 బడ్జెట్?
ఈ చిత్రానికి భారీగానే ఖర్చైంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తోపాటు భారీ తారాగణం నటించింది. రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, నర్గీస్ ఫక్రీ, సోనమ్ బజ్వా, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, జానీ లీవర్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించి అలరించారు. యోయో హానీసింగ్ సంగీత దర్శకుడు. ఇలా రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చు, ప్రమోనల్ వ్యయంతో కలిపి మొత్తంగా రూ.225 కోట్లు అయ్యింది.

హౌజ్ ఫుల్ 5 బ్రేక్ ఈవెన్ టార్గెట్?
వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు అన్ని కలుపుకొని రూ.240 కోట్ల బ్రేక్ ఈవెన్ పాయింట్ గా వాల్యూ కట్టారు ట్రేడ్ పండితులు. మరోవైపు డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా రూ.135 కోట్లు తిరిగి వచ్చింది. థియేట్రికల్ రన్ ద్వారా రూ.105 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే ఆ మార్క్ దాటేశారు.
7 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు..
వారం రోజుల్లో అక్షయ్ కుమార్ హౌజ్ ఫుల్ 5తో దుమ్ములేపాడు. బాక్సాఫీస్ వద్ద 7 రోజుల్లో ఈ చిత్రానికి రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలైంది. ఈ చిత్రానికి తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ.39.75 కోట్లు, 2వ రోజు రూ.39.25 కోట్లు, 3వ రోజు రూ.41.40 కోట్లు, 4వ రోజు రూ.21.10 కోట్లు, 5వ రోజు రూ.14.50 కోట్లు, 6వ రోజు రూ.12.25 కోట్లు, 7వ రోజు రూ.12 కోట్లు వసూలైందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో 8వ రోజు వరకు ఇండియా నెట్ రూ.133.32 కోట్లకు చేరుకుంది.
ఓవర్సీస్ బాక్సాఫీస్ వసూళ్లు..
ఓవర్సీస్‌లో హౌస్‌ఫుల్ 5 సినిమా జోరుగా వసూళ్లు రాబడుతోంది. నార్త్ అమెరికా, యూకే, బ్రిటన్, గల్ఫ్ దేశాల్లో బాక్సాఫీస్ కలెక్షన్లు భారీగానే అందుతున్నారు. వారం రోజులుగా వసూళ్లు ఇలా ఉన్నాయి. మొదటి రోజు రూ.11 కోట్లు, 2వ రోజు రూ.13 కోట్లు, 3వ రోజు రూ.11 కోట్లు, 4వ రోజు రూ.15 కోట్లు, 5వ రోజు రూ.1 కోటీ, 6వ రోజు రూ.2, రూ.7వ రోజు 1కోటీ వసూల్ చేసినట్టు సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది.
8వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు..
హౌజ్ ఫుల్ 5 చిత్రానికి మొదటి వారంలోనే రూ.200 వరకు ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు అందాయి. ఇక 8వ రోజు కూడా భారీగానే వసూళ్లు దక్కాయి. 8వ రోజు ఇండియా నెట్ రూ.6.07 కోట్ల వరకు వసూల్ చేసిందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక 8వ రోజు ఇండియా గ్రాస్ రూ.12 కోట్ల వసూళ్లు చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇలా 8 రోజుల్లో ఇండియా + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.210 కోట్ల వరకు వసూలైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











